Share News

Dallas: డాలస్‌లో వైభవంగా 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవం

ABN , Publish Date - Aug 17 , 2025 | 02:52 PM

అమెరికా వ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు. తాజాగా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో డాల‌స్‌లో స్వాతంత్ర్య దినోత్సవం వైభవంగా జరిగింది.

Dallas: డాలస్‌లో వైభవంగా 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవం
Mahatma Gandhi Memorial of North Texas

ఇంటర్నెట్ డెస్క్: మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో డాల‌స్‌లో ఎన్నారైలు మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి భారత దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సముపార్జనలో సర్వస్వం త్యాగం చేసి అసువులు బాసిన సమరయోధులను, మాహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ శుభాష్ చంద్రబోస్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి నాయకుల కృషిని ఎంత కొనియాడినా తక్కువేనని అన్నారు. డా. ప్రసాద్ తోటకూర భారత పతాక ఆవిష్కరణ చేసి, శుక్రవారం పని రోజు అయినప్పటికీ, ఉదయమే ఇంత పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరుకావడం వారి మాతృ దేశభక్తిని చాటుతుందని అంటూ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.


తెనాలి డబుల్ హార్స్ వారు ఇండియా నుంచి పంపిన అందరికీ ప్రీతి పాత్రమైన తెలుగింటి సున్నుండలు అందరి ముఖాలలో చిరునవ్వులు చిందించాయి. బోర్డు సభ్యులు రాజీవ్ కామత్, మహేందర్ రావు, రాజేంద్ర వంకావాల, తిరుమల్ రెడ్డి కుంభం, జస్టిన్ వర్గీస్, భారతి మిశ్రా, కళయ్ కృష్ణమూర్తి తదితర నాయకులు హాజరయ్యారు.

2.jpg


ఈ వార్తలు కూడా చదవండి:

తానా పాఠశాల ఆధ్వర్యంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఎడారి జలవనరుల విధాన పరిశీలనకు రండి.. ఏపీ మంత్రికి ఎన్నారై ఆహ్వానం

Read Latest and NRI News

Updated Date - Aug 17 , 2025 | 03:38 PM