Share News

Kerala NRI Booked: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అభ్యంతరకర పోస్టులు.. కేరళ ఎన్నారైపై కేసు

ABN , Publish Date - Aug 16 , 2025 | 10:28 PM

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను అవామానించేలా పోస్టులు పెట్టిన ఓ కేరళ ఎన్నారైపై తాజాగా కేసు నమోదైంది. స్థానిక బీజేపీ నేత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. త్వరలో సైబర్ పోలీసులకు కేసును బదిలీ చేస్తామని తెలిపారు.

Kerala NRI Booked: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అభ్యంతరకర పోస్టులు.. కేరళ ఎన్నారైపై కేసు
Kerala NRI Booked

ఇంటర్నెట్ డెస్క్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను అవమానిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన కేరళ ఎన్నారై రాష్ట్రంలో తాజాగా కేసు నమోదైంది. ఎడతల పోలీసులు ఎన్నారై అల్బిచన్ మురింగయిల్‌పై కేసు నమోదు చేశారు. సదరు ఎన్నారై కొట్టాయం జిల్లాకు చెందిన వ్యక్తి అని సమాచారం. అతడిపై స్థానిక బీజేపీ నేత అనూప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న సదరు ఎన్నారై స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను అవమానిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టినట్టు అనూప్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. భారత్‌ను అగౌరపరిచే అనేక పోస్టులు ఆయన ఫేస్‌బుక్ పేజీలో ఉన్నట్టు కూడా వెల్లించారు.


ఈ విషయంపై స్పందించిన స్థానిక పోలీసులు సదరు ఎన్నారైపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. తదుపరి విచారణ కోసం ఈ కేసును త్వరలో సైబర్ పోలీసులకు బదిలీ చేస్తామని కూడా వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సౌదీ తెలుగు ప్రవాసీ ప్రముఖులు

ఎడారి జలవనరుల విధాన పరిశీలనకు రండి.. ఏపీ మంత్రికి ఎన్నారై ఆహ్వానం

Read Latest and NRI News

Updated Date - Aug 16 , 2025 | 11:00 PM