Share News

Insurance For NRIs: విదేశాలకు వెళ్లే స్టూడెంట్స్ కోసం కొత్త ఇన్సూరెన్స్ పాలసీలు.. జాబ్ పోయినా, వీసా రద్దయినా పరిహారం

ABN , Publish Date - May 19 , 2025 | 02:38 PM

విదేశాల్లో చదువుకునే భారతీయ విద్యార్థుల వీసాలు రద్దయినా, ఆ తరువాత ఉద్యోగాలు పోయి స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చినా పరిహారం చెల్లించేలా కొత్త పాలసీలు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి.

Insurance For NRIs: విదేశాలకు వెళ్లే స్టూడెంట్స్ కోసం కొత్త ఇన్సూరెన్స్ పాలసీలు.. జాబ్ పోయినా, వీసా రద్దయినా పరిహారం
Indian student insurance

ఇంటర్నెట్ డెస్క్: విదేశీ విద్య స్వరూప స్వభావాలు మారిపోతున్నాయి. ఉపాధి కోసం ఫారిన్ వెళుతున్న అనేక మంది విద్యార్థులు వీసా రద్దు, జాబ్ పోవడం వంటి కారణాలతో ఇంటి బాట పట్టాల్సి వస్తోంది. ఇలాంటి వారిని కోసం భారతీయ ఇన్సూరెన్స్ కంపెనీలు కొత్త పాలసీతో ముందుకొచ్చాయి. మెడికల్ ఖర్చులతో పాటు వీసా రద్దు, జాబ్ పోవడం, ఇతర ఎమర్జెన్సీ సందర్భాల్లో పరిహారం చెల్లించేలా ఈ పాలసీలను రూపొందిస్తున్నారు.

అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు భారతీయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో వెళుతున్నారు. అయితే, ప్రస్తుత ఇన్సూరెన్స్ పాలసీలు భారతీయ విద్యార్థుల అవసరాలు తీర్చేలా ఉండటం లేదని అధికశాతం మంది భావిస్తున్నారు. కాబట్టి, భారతీయు విద్యార్థుల అవసరాలకు తగిన విధంగా ఇన్సూరెన్స్ అందించేందుకు కంపెనీలు రంగంలోకి దిగాయి.


ఈ కొత్త పాలసీలు.. మెడికల్ కవరేజీతో పాటు విసా తిరస్కరణ, వీసా ఉపసంహరణ, జాబ్ పోవడం వంటివి జరిగిన సందర్భాల్లో విద్యార్థులకు అక్కరకొస్తుంది. కొన్ని పాలసీలు అక్కడి నివాస ఖర్చులు, తప్పనిసరి పరిస్థితుల్లో స్వదేశానికి తిరిగొచ్చేందుకు కావాల్సిన ప్రయాణ ఖర్చులను కూడా కవర్ చేస్తున్నాయి. ఇప్పటికే కొందరు విద్యార్థులు ఇలాంటి పాలసీలను ఎంచుకుంటున్నారు కూడా.

ముఖ్యంగా విదేశీ ఇన్సూరర్లతో పోలిస్తే భారతీయ కంపెనీల పాలసీలు అందుబాటు ధరల్లో కూడా ఉండటం విద్యార్థులకు ప్రయోజనం కలిగిస్తోంది. సమ్మిళ పాలసీల కోసం విద్యార్థుల్లో డిమాండ్ పెరుగుతోంది. జర్మనీ లాంటి దేశాలకు వెళ్లే వారు కూడా ఈ పాలసీపై మక్కువ చూపుతున్నారు. అయితే, కొందరు విద్యార్థులు ఇప్పటికీ యూనివర్సిటీలు సూచించిన ఇన్సూరర్ల నుంచి పాలసీలు తీసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు.


క్లెయిమ్ సెటిల్మెంట్ విధానం సులభంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే, ఇలాంటి వారికి కూడా ప్రత్యేకమైన పాలసీలను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. యూనివర్సిటీలు సూచించే పాలసీలకు అదనంగా ప్రత్యేక పాలసీలు ఇస్తున్నాయి. తద్వారా అనుకోని పరిస్థితుల్లో ఆర్థిక ఒడిదుడుకుల నుంచి తమని తాము రక్షించుకునే అవకాశం ప్రస్తుతం భారతీయ విద్యార్థులకు అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి:

ఐర్‌లాండ్‌లో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు

ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవానికి సౌదీ పిలుస్తోంది రా.. కదలి రా

SATA: సాటా రియాధ్ అధ్యక్షురాలిగా చేతన నియామకం

బహ్రెయిన్‌లో ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు

Read Latest and NRI News

Updated Date - May 19 , 2025 | 02:39 PM