Share News

Indian Student in US Arrested: అమెరికాలో వృద్ధ దంపతులకు టోపీ.. భారతీయ విద్యార్థి అరెస్టు

ABN , Publish Date - May 13 , 2025 | 11:44 PM

అమెరికాలో వృద్ధ జంటను మోసగించి డబ్బు దోచుకున్న భారతీయ విద్యార్థిని అక్కడి పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

Indian Student in US Arrested: అమెరికాలో వృద్ధ దంపతులకు టోపీ.. భారతీయ విద్యార్థి అరెస్టు
Indian student fraud

ఇంటర్నెట్ డెస్క్: మిషిగన్‌కు చెందిన వృద్ధ జంటను మోసం చేసి 50 వేల డాలర్లు దోచుకున్న ఓ భారత సంతతి విద్యార్థిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని వేదాంత్‌కుమార్ భూపేన్‌భాయ్ పటేల్‌గా గుర్తించారు. వృద్ధ దంపతులను నిందితుడు ఈమెయిల్ ద్వారా సంప్రదించి చైల్డ్ పోర్నోగ్రఫీ పేరిట బెదిరించి డబ్బులు దోచుకున్నాడని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భూపేన్‌పటేల్ స్టూడెంట్ వీసాపై అమెరికాకు వెళ్లాడు. అక్కడ మరో రెండు ఫ్రాడ్ ఘటనల్లో కూడా అతడి పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. భూపేన్‌ వృద్ధదంపతులను ఈమెయిల్ ద్వారా సంప్రదించాడు. వారి క్రెడిట్ కార్డు ద్వారా చైల్డ్ పోర్నోగ్రఫీ కొనుగోలు జరిగిందని చెప్పి భయపెట్టాడు.


ఈ కేసు నుంచి బయటపడాలంటే తమ బ్యాంకు అకౌంట్‌లో నుంచి 50 వేల డాలర్లు డ్రా చేసి ప్రభుత్వ ఖజానా ఏజెంట్‌కు చెల్లించాలని చెప్పారు. డబ్బును బాక్సులో పెట్టి ఇంటి బయట ఉంచాలని చెప్పాడు. ట్రెజరీ ఏజెంట్ వచ్చి బాక్సును తీసుకెళతాడని అన్నారు.

భూపేన్ మాటలను నమ్మిన బాధితులు అతడు చెప్పినట్టే చేశారు. ఆ తరువాత నిందితుడు వారి ఇంటికెళ్లి ట్రెజరీ ఏజెంట్ అని చెప్పుకున్నాడు. దర్జాగా డబ్బు తీసుకుని వెళ్లిపోయాడు. చివరకు ఈ విషయంలో పోలీసులకు తెలియడంతో వారు వెంటనే రంగంలోకి దిగారు. అతడిని ఒహాయోలో అదుపులోకి తీసుకున్నారు.


అయితే, బాధితుల నుంచి తీసుకున్న డబ్బును అతడు అప్పటికే భారత్‌లోని తన స్వగ్రామానికి పంపించాడని కూడా తెలుసుకున్నారు. ఆ తరువాత ఇక్కడి పోలీసులకు సమాచారం అందించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అతడికి బెయిల్ మంజూర్ చేసేందుకు లక్ష డాలర్లను బాండ్ కింద చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో పోలీసులు అతడిని మిషిగన్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి:

ఐర్‌లాండ్‌లో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు

ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవానికి సౌదీ పిలుస్తోంది రా.. కదలి రా

SATA: సాటా రియాధ్ అధ్యక్షురాలిగా చేతన నియామకం

బహ్రెయిన్‌లో ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు

Read Latest and NRI News

Updated Date - May 14 , 2025 | 12:12 AM