Mother's Day Celebration: బహ్రెయిన్‌లో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో మాతృదినోత్సవం
ABN , Publish Date - May 12 , 2025 | 07:48 PM
బహ్రెయిన్‌లోని తెలుగు కళా సమితి ‘మదర్స్ డే’ వేడుకలను వైభవంగా నిర్వహించింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: అమృతం ఉందో లేదో అది ఆయుష్షు పోస్తుందో లేదో తెలియదు కానీ ‘అమ్మ’ మాత్రం తన ఆయుష్షును సైతం తన పిల్లలకు పోస్తుంది. ఎడారి దేశాలలో తన గుండెల మీద పెరిగిన పిల్లలు ఉన్నత చదువులకై దూరంగా వెళ్ళిపోతుంటే మాతృమూర్తి అనుభవించే ఆవేదన వర్ణనాతీతం.
అమ్మ ప్రేమకు కొలమానం లేదు కానీ నేటి తరం చిన్నారులకు మాతృమూర్తి ప్రాధాన్యతను తెలియజేసే ఉద్దేశ్యంతో బహ్రెయిన్‌లోని తెలుగు కళా సమితి ‘మదర్స్ డే’ వేడుకలను పూర్తిగా అమ్మ ఒడి వాతావరణంలో అన్నట్లుగా నిర్వహించింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ నటి ప్రభ తల్లి ఔన్నత్యం గురించి వివరించారు. తూర్పు గోదావరి జిల్లా నుండి బహ్రెయిన్‌లో ఉంటున్న తన తల్లి శ్రీ లక్ష్మి వద్దకు వచ్చిన ఆరాధ్య అమ్మ వెలితిని వివరించారు.

సృష్టికారకత్వానికి అమ్మ చేవ్రాలు అని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, ఎన్టీఆర్ సాహిత్య కమిటీ అధ్యక్షులు టి.డి.జనార్దన్ అన్నారు. సకల జగత్తూ పురోగమించడానికి, జ్ఞానయుతంగా వర్ధిల్లడానికి మూలకారక శక్తి మాతృమూర్తి అని అన్నారు.
ఈ సందర్భంగా గాయకులు రాము, నాదప్రియ సంగీత కార్యక్రమం అందర్నీ అలరించింది. తెలుగు కళా సమితి మాజీ అధ్యక్షులు మోహన్ మురళీధర్, హరిబాబు, శివ, మురళీకృష్ణ, యుగంధర్, సతీష్ శెట్టి, సతీష్ బొల్లా, కోటేశ్వరరావు, శశాంక్, వంశీ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

తెలుగు కళా సమితి అధ్యక్షులు జగదీష్. పి, ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ పల్ల కోశాధికారి నాగ శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి లత, సభ్యత్వ కార్యదర్శి గంగ సాయి, సాంస్కృతిక కార్యదర్శి సంతోష్, క్రీడల కార్యదర్శి చంద్రబాబు, ఐటీ హెడ్ దీపక్ మాతృ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:
ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవానికి సౌదీ పిలుస్తోంది రా.. కదలి రా
SATA: సాటా రియాధ్ అధ్యక్షురాలిగా చేతన నియామకం
బహ్రెయిన్‌లో ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు