Share News

Young Yoginis: యోగాభిలాష

ABN , Publish Date - Jun 21 , 2025 | 12:57 AM

శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, ఏకాగ్రతను అందించే అద్భుత ప్రక్రియ యోగా. మన శరీరాన్ని ఎలా వంచాలి.శ్వాసను ఎలా బిగబట్టాలి అనేవి మ్రాతమే కాదు.

Young Yoginis: యోగాభిలాష

శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, ఏకాగ్రతను అందించే అద్భుత ప్రక్రియ యోగా. మన శరీరాన్ని ఎలా వంచాలి.శ్వాసను ఎలా బిగబట్టాలి అనేవి మ్రాతమే కాదు.మొత్తం మానవ వ్యవస్థను అర్థం చేసుకొనే విజ్ఞాన శాస్త్రం ఇది. యోగాసనాల వల్ల అవయవాలకు, మెదడుకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అనేక రుగ్మతలను దూరం చేయడంలో ఆసనాలు ఎంతో తోడ్పడతాయని నిరూపితమైంది. ఈ నేపథ్యంలో శారీరక, మానసిక దారుఢ్యానికి జీవనశైలిలో యోగాను భాగం చేసుకున్నవారే కాదు. క్లిష్టమైన ప్రక్రియలు ప్రదర్శించి రికార్డులు నెలకొల్పేవారూ ఉన్నారు. ఒక క్రీడగా పోటీపడి పతకాలు సాధించేవారు. సరికొత్త హంగులు అద్ది ప్రయోగాలు చేసే ఔత్సాహికులూ కనిపిస్తుంటారు.


ఆ కోవకు చెందినవారే గంపల లహరిదుర్గ, రేఖాడి చైత్రశివ వాసుకి, వెలుగుబంటి సాత్విక. ఈ ముగ్గురూ యోగాలో అపురూ విజయాలెన్నో అందుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వీరి పరిచయం.

నాట్యంతో కలిపి..

కాకినాడలోని గర్ల్స్‌ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న లహరి దుర్గ నృత్యాన్ని యోగాతో కలిపి నేర్చుకొంటోంది. యోగా కోచ్‌ దుర్గా శాంతప్రసాద్‌ ఆధ్వర్యంలో ఈ విభిన్న ప్రక్రియను ఐదేళ్లుగా సాధన చేస్తోంది. లహరి తండ్రి రామకృష్ణ ప్రైవేటు ఉద్యోగి. తల్లి గృహిణి. రెండేళ్ల కిందట ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ యోగాసన చాంపియన్‌షి్‌పలో లహరి చక్కని ప్రదర్శనతో అదరగొట్టింది. 70 దేశాలు పాల్గొన్న ఈ పోటీలో కాంస్య పతకం నెగ్గింది. జాతీయ స్థాయిలోనూ పలు పతకాలు అందుకుంది. అంతర్జాతీయ స్థాయి చాంపియన్‌షి్‌ప్సలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి, పతకాలు సాధించడమే తన లక్ష్యమని చెబుతున్న లహరి దాని కోసం అహర్నిశలూ శ్రమిస్తోంది. అంతేకాదు డ్యాన్స్‌ రియాలిటీ షోస్‌లో పాల్గొని తన సత్తా చాటాలని కోరుకొంటోంది

Updated Date - Jun 21 , 2025 | 12:57 AM