సీలింగ్ ఫ్యాన్ స్పీడ్‌గా తిరగట్లేదా
ABN , Publish Date - May 15 , 2025 | 05:36 AM
ఎండాకాలంలో ఒక్కోసారి... సీలింగ్ ఫ్యాన్‌కి ఎంత స్పీడ్ పెట్టినా గాలి ఆడదు. చెమటతో చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఇబ్బంది పడకుండా కొన్ని చిట్కాలు పాటించి ఫ్యాన్ వేగాన్ని పెంచుకోవచ్చు...
ఎండాకాలంలో ఒక్కోసారి... సీలింగ్ ఫ్యాన్‌కి ఎంత స్పీడ్ పెట్టినా గాలి ఆడదు. చెమటతో చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఇబ్బంది పడకుండా కొన్ని చిట్కాలు పాటించి ఫ్యాన్ వేగాన్ని పెంచుకోవచ్చు.
ఫ్యాన్ రెక్కల మీద దుమ్ము, ధూళి పేరుకుంటే ఫ్యాన్ వేగంగా తిరగలేదు. వారానికి ఒకసారి ఫ్యాన్ రెక్కలను రెండువైపులా తడి గుడ్డతో శుభ్రంగా తుడవాలి. అలాగే మోటార్ దగ్గర ఉండే బేరింగ్‌లను కూడా తుడవాలి. ఫ్యాన్ శుభ్రంగా ఉంటే గాలి వేగంగా గది అంతటా వ్యాపిస్తుంది.
ఫ్యాన్ వేగాన్ని కెపాసిటర్ నియంత్రిస్తుంది. మోటార్‌కు కావాల్సిన శక్తిని అందిస్తుంది. కెపాసిటర్ సరిగా పని చేయని పక్షంలో ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతుంది. ఒక్కోసారి ఆగిపోవచ్చు కూడా. అంతేకాదు ఫ్యాన్ నుంచి శబ్దాలు కూడా వస్తుంటాయి. కాబట్టి కెపాసిటర్‌ను తరచూ పరీక్షిస్తూ ఉండాలి.. అవసరమైతే సమాన ఓల్జేజ్ ఉన్న కొత్త కెపాసిటర్‌ను అమరిస్తే సమస్య తీరుతుంది.
మోటార్‌లోని బేరింగ్‌లు... ఫ్యాన్ సజావుగా తిరగడానికి తోడ్పడతాయి. వీటి మధ్య రాపిడీ పెరిగినప్పుడు ఫ్యాన్ వేగం తగ్గుతుంది. శబ్దం కూడా వస్తుంటుంది. బేరింగ్‌లకు ఎప్పటికప్పుడు లూబ్రికెంట్ ఆయిల్ వేస్తే ప్రయోజనం కనిపిస్తుంది. అవసరమైతే బేరింగ్‌లను వెంటనే మార్చుకోవాలి.
ఇంట్లో ఓల్టేజ్ తక్కువగా ఉన్నా కూడా ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతుంది. ఇంటి వైరింగ్‌ను పరీక్షించి అవసరమైతే ఓల్టేజ్ స్టెబిలైజర్‌ను వాడడం మంచిది. సరైన ఓల్టేజ్ అందితేనే ఫ్యాన్ వేగంగా తిరుగుతుంది.
ఫ్యాన్ రెక్కలు సమతుల స్థితిలో లేకపోయినా, అవి వంగిపోయినా, వాటిని సరిగా బిగించకపోయినా ఫ్యాన్ వేగం తగ్గుతుంది. అలాగే తిరిగేటప్పుడు ఫ్యాన్ ఎక్కువగా ఊగుతుంది. అలాంటప్పుడు వెంటనే బాగు చేయించండి.
ఫ గది విస్తీర్ణాన్ని అనుసరించి రెక్కల పరిమాణం, మోటార్ సామర్థ్యం ఉండే ఫ్యాన్‌ని ఎంచుకుంటే గాలి చక్కగా అన్ని వైపులా ప్రసరిస్తుంది.
ఇవి కూడా చదవండి..
Operation Sindoor: ఎస్-400తో ప్రధాని మోదీ ... పాకిస్థాన్‌కు హెచ్చరిక సందేశం..
Terrorists Trapped: జుమ్మూలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదుల హతం
Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు