Share News

Kaftan sarees: ఖఫ్తాన్‌ శారీతో కొత్తగా...

ABN , Publish Date - Jan 29 , 2025 | 01:23 AM

ఇలాంటి ఫ్యాషన్‌ ప్రపంచంలోకి ‘ఖఫ్తాన్‌ శారీస్‌’ మేమున్నామంటూ వచ్చేశాయి. మహిళలకు విపరీతంగా నచ్చేశాయి. ఒకవైపు చీరలా కనిపిస్తూ మరోవైపు అందమైన కుర్తీని గుర్తుకు తెస్తూ ఇండోవెస్ట్రన్‌ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Kaftan sarees: ఖఫ్తాన్‌ శారీతో కొత్తగా...

ఫ్యాషన్‌ డ్రెస్‌లు సౌకర్యానికి పెద్ద పీట వేస్తాయి. అలాగని సంప్రదాయాన్ని వదిలిపెట్టవు. అందుకే అవంటే అందరూ మోజు పడుతుంటారు. ఇలాంటి ఫ్యాషన్‌ ప్రపంచంలోకి ‘ఖఫ్తాన్‌ శారీస్‌’ మేమున్నామంటూ వచ్చేశాయి. మహిళలకు విపరీతంగా నచ్చేశాయి. ఒకవైపు చీరలా కనిపిస్తూ మరోవైపు అందమైన కుర్తీని గుర్తుకు తెస్తూ ఇండోవెస్ట్రన్‌ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చీర అంటే ఇష్టం ఉన్నప్పటికీ కట్టుకోవడానికి ఇబ్బంది పడే యువతులకు ఈ ఖఫ్తాన్‌ శారీ వరం లాంటిది.

ఖఫ్తాన్‌ శారీని కాటన్‌, పట్టు, చందేరీ సిల్క్‌, జార్జెట్‌, టస్సర్‌... ఇలా ఏ రకం ఫ్యాబ్రిక్‌ చీరతోనైనా రూపొందించవచ్చు.

వీటి తయారీ విషయానికి వస్తే... చక్కని చీరకు కుచ్చిళ్లు సెట్‌ చేసి... లెహంగా మాదిరి కుట్టేస్తారు. కొంగులో కొంత భాగాన్ని కుర్తీలా కుట్టి, మిగిలినదాన్ని భుజాలమీదుగా వేలాడేలా జతచేస్తారు. చీర కొంగుకు ఉన్నట్టే కుర్తీని కూడా స్టెప్స్‌తో రూపొందిస్తున్నారు! ఇలాంటివి చిన్న పార్టీల్లో వేసుకోవడానికి బాగుంటాయి.

కుర్తీకి కాలర్‌, స్టార్‌, వి, రౌండ్‌ నెక్‌ డిజైన్‌లను అమరుస్తున్నారు. నెక్‌ డిజైన్‌ను అనుసరించి బటన్స్‌ కూడా అమరుస్తున్నారు. వీటితోపాటు చక్కని ఎంబ్రాయిడరీ, సీక్వెన్స్‌, జర్దోసీ వర్క్‌లు చేసిన ఖఫ్తాన్‌ శారీలను మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

కుర్తీ పొట్టిగా ఉన్నపుడు నడుము భాగంలో బెల్ట్‌ పెట్టుకుంటే చీర కట్టుకున్నట్లే కనిపిస్తుంది. అదే పొడవుగా ఉంటే లాంగ్‌ గౌన్‌ లుక్‌ వస్తుంది.

ఖఫ్తాన్‌ శారీ ధరించినపుడు ఎక్కువగా ఆభరణాల అవసరం ఉండదు. చిన్న గొలుసు, ఒక ఉంగరం, చక్కని స్టడ్స్‌ ఉంటే చాలు. అలాగే ప్రత్యేకమైన హెయిర్‌ స్టయిల్‌ కూడా అక్కర్లేదు. ఎంత సాధారణంగా ఉంటే అంత హుందాగా కనిపిస్తారు. కేవలం ఈ డ్రెస్‌ స్టయిల్‌ ఒక్కటే అందరినీ చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది.


మరిన్ని తెలుగు వార్తల కోసం..

Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం

Also Read: నీ ఇంట్లో నుంచి అవార్డు ఇస్తున్నావా సంజయ్..!

Also Read:ఆర్చర్ జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి

Also Read: అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు

Updated Date - Jan 29 , 2025 | 01:32 AM