Share News

ఐవీఎఫ్‌ ఫెయిల్‌ అయితే

ABN , Publish Date - Jun 26 , 2025 | 04:28 AM

మహిళలో అండాలు, పురుషుడిలో వీర్యకణాలు బాగానే ఉన్నా, ఐ.వి.ఎఫ్‌ ఫెయిల్‌ అవుతూ ఉండడానికి కారణం స్పెర్మ్‌ డి.ఎన్‌.ఎలో సమస్య అయి ఉండవచ్చు. ఐ.వి.ఎ్‌ఫకు ముందు తప్పనిసరిగా స్పెర్మ్‌ డి.ఎన్‌.ఎ పరీక్ష చేయించాలి...

ఐవీఎఫ్‌ ఫెయిల్‌ అయితే

కౌన్సెలింగ్‌

డాక్టర్‌! మేం ఇప్పటివరకూ పలుసార్లు ఐ.వి.ఎఫ్‌ ప్రయత్నించాం. అండాలు, వీర్యకణాలు మెరుగ్గానే ఉన్నా, పదే పదే ఐ.వి.ఎఫ్‌ ఎందుకు ఫెయిల్‌ అవుతోంది. కారణం ఏమై ఉంటుంది?

- ఓ సోదరి, హైదరాబాద్‌

మహిళలో అండాలు, పురుషుడిలో వీర్యకణాలు బాగానే ఉన్నా, ఐ.వి.ఎఫ్‌ ఫెయిల్‌ అవుతూ ఉండడానికి కారణం స్పెర్మ్‌ డి.ఎన్‌.ఎలో సమస్య అయి ఉండవచ్చు. ఐ.వి.ఎ్‌ఫకు ముందు తప్పనిసరిగా స్పెర్మ్‌ డి.ఎన్‌.ఎ పరీక్ష చేయించాలి. లోపాలు ఉంటే, మందులు వాడి, సరిదిద్దుకున్న తర్వాతే ఐ.వి.ఎ్‌ఫకు వెళ్లడం మంచిది. లేదంటే లక్షలు ఖర్చుపెట్టి చేయించుకునే ఐ.వి.ఎఫ్‌ ఫెయిల్‌ అయ్యే అవకాశాలు ఎక్కువ. కేవలం 7 వేల ఖరీదు చేసే ఈ పరీక్ష కోసం వెనకాడడం సరికాదు. సాధారణంగా పురుషులకు చేసే స్పెర్మ్‌ టెస్ట్‌లో వీర్యకణాల ఆకారం, కదలికలు, సంఖ్య వివరాలు మాత్రమే తెలుస్తాయి. అవన్నీ బాగానే ఉన్నా వీర్యకణాల డి.ఎన్‌.ఎలో లోపం ఉండే వీలుంది. దీన్ని కనిపెట్టి సరిచేయకుండా ఐ.వి.ఎఫ్‌ చేయించుకుంటే గర్భధారణ జరిగినా అబార్షన్‌ అవడం, లేదా గర్భం దాల్చకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. స్పెర్మ్‌ డి.ఎన్‌.ఎ పరీక్షలో డి.ఎన్‌.ఎ సమస్యతో కూడిన వీర్యకణాలు 30ు కంటే ఎక్కువ ఉంటే ఫెర్టిలిటీ జరగదు. కాబట్టి డి.ఎన్‌.ఎ పరీక్ష చేసి, సమస్య ఉంటే సరిదిద్దుకోవాలి.

డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి

ఆండ్రాలజిస్ట్‌,

ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌,

జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.

ఇవి కూడా చదవండి..

కమాండర్ అభినందన్‌ను బంధించిన పాకిస్థాన్ మేజర్ హతం

ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 26 , 2025 | 04:28 AM