Share News

ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లేటప్పుడు

ABN , Publish Date - Jun 16 , 2025 | 05:37 AM

సాధారణంగా తొమ్మిది నెలలు నిండిన తరవాత ప్రసవం కోసం గర్భిణులు ఆసుపత్రిలో చేరుతూ ఉంటారు. ప్రసవం తరవాత కనీసం మూడు నుంచి అయిదు రోజులు అక్కడే...

ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లేటప్పుడు

సాధారణంగా తొమ్మిది నెలలు నిండిన తరవాత ప్రసవం కోసం గర్భిణులు ఆసుపత్రిలో చేరుతూ ఉంటారు. ప్రసవం తరవాత కనీసం మూడు నుంచి అయిదు రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇలా ఆసుపత్రికి వెళ్లే ముందు కాబోయే తల్లులు తమ వెంట ఏమేం తీసుకువెళ్లాలో తెలుసుకుందాం...

  • వైద్యులు సూచించిన ప్రకారం ప్రసవ తేదీ సమీపిస్తుందనగానే ఒక బ్యాగ్‌ను సిద్ధం చేసుకోవాలి. ఆ బ్యాగ్‌ పెద్దదిగా, తేలికగా పట్టుకోవడానికి వీలుగా ఉండాలి. తల్లీ బిడ్డలకు అవసరమయ్యే వస్తువులు, దుస్తులు తదితరాలను పొందికగా సర్దడానికి అనువుగా ఉండాలి.

  • వైద్యుల సూచనలతో ఇప్పటి వరకు వాడిన మందుల చీటీలు, ఇతరత్రా చేయించుకున్న వైద్య పరీక్షల రిపోర్టులు, ఎక్స్‌రేలు, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి సంబంధించి కీలక సమాచారాన్ని తెలిపే పత్రాలను ఒక ఫైల్‌లో ఉంచాలి. దీనితోపాటు ఆధార్‌ కార్డ్‌, ఇన్సూరెన్స్‌ కార్డ్‌లను అడిగిన వెంటనే తీసి చూపించేందుకు వీలుగా బ్యాగ్‌లో పెట్టాలి.

  • ప్రసవం అయిన తరవాత ధరించేందుకు వదులుగా ఉండే నూలు దుస్తులు, పొడవాటి చున్నీలు, బాలింతల కోసం ప్రత్యేకించిన బట్టలు, తువాళ్లు, లోదుస్తులు, మెటర్నిటీ ప్యాడ్స్‌ సర్దుకోవాలి.

  • బిడ్డకు పాలిచ్చేటప్పుడు ఒడిలో పెట్టుకోవడానికి మెత్తటి దిండును తీసుకెళ్లాలి.

  • రోజువారీగా అవసరమయ్యే టూత్‌బ్రష్‌, పేస్ట్‌, సబ్బులు, షాంపూలు, దువ్వెన, లిప్‌ బామ్‌, మసాజ్‌ ఆయిల్‌ తదితరాలను ఒక బాక్స్‌లో పెట్టుకోవాలి.

  • ప్రసవం తరవాత నడవమని వైద్యులు చెబుతుంటారు. మెత్తగా సౌకర్యవంతంగా ఉండే చెప్పుల జతను తీసుకెళ్లాలి. పాదాలను వెచ్చగా ఉంచే సాక్స్‌ కూడా పెట్టుకోవాలి.


  • పుట్టిన బిడ్డకు డైపర్లు అవసరమవుతాయి. వీటితోపాటు పిల్లలకు మాత్రమే ప్రత్యేకించిన ర్యాష్‌ క్రీమ్‌ను కూడా బ్యాగ్‌లో పెట్టుకోవాలి. అలాగే బిడ్డ కోసం రెండు జతల దుస్తులు, తలకు క్యాప్‌, కాళ్లకు సాక్స్‌, చేతులకు మిటెన్స్‌, బేబీ వైప్స్‌ లేదా మెత్తని టవల్స్‌, బేబీ క్యారియర్‌ లేదా స్లీపింగ్‌ బ్యాగ్‌ తీసుకెళ్లాలి.

  • ప్రసవం తరవాత ఆకలి ఎక్కువగా ఉంటుంది. తేలికగా జీర్ణమయ్యే చిరుతిళ్లు, డ్రై ఫ్రూట్స్‌ లాంటివాటిని బాక్స్‌లో పెట్టుకుని తీసుకెళ్లాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

సెంట్రల్ బ్యాంకులో 4,500 జాబ్స్.. అర్హతలు ఎలా ఉన్నాయంటే..

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 16 , 2025 | 05:37 AM