Share News

Swami Vivekananda: దేవుడి ఉనికికి రుజువేదీ?

ABN , Publish Date - Jan 31 , 2025 | 04:16 AM

చిన్న వయసునుంచే ఆయన ఆటపాటల్లో, చదువులో చురుగ్గా ఉండేవారు. గణితం, చరిత్ర, ఫిలాసఫీలో పట్టభద్రుడయ్యాక, న్యాయ విద్యను అభ్యసించారు. కళాశాలలో చదువుతున్నప్పుడే...

Swami Vivekananda: దేవుడి ఉనికికి రుజువేదీ?

భారతీయత తాత్త్వికతను విశ్వవ్యాప్తం చేయడానికి పరిశ్రమించిన మహనీయుడు స్వామి వివేకానంద. కోల్‌కతాలోని ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన ఆయనకు తల్లితండ్రులు పెట్టిన పేరు నరేంద్రనాథ్‌. చిన్న వయసునుంచే ఆయన ఆటపాటల్లో, చదువులో చురుగ్గా ఉండేవారు. గణితం, చరిత్ర, ఫిలాసఫీలో పట్టభద్రుడయ్యాక, న్యాయ విద్యను అభ్యసించారు. కళాశాలలో చదువుతున్నప్పుడే... శ్రీ రామకృష్ణ పరమహంసను కలుసుకున్నారు. అప్పటికి వివేకానందుడి వయసు పద్ధెనిమిదేళ్ళు. నాటినుంచి శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో తననుతాను తీర్చిదిద్దుకున్నారు.

వివేకానందుడు ఎల్లప్పుడూ తార్కికంగా ఆలోచించేవారు. తనకు ప్రశ్నగా అనిపించిన ప్రతిదానికీ సరైన సమాధానాన్ని కోరుకొనేవారు. ఒక రోజు ఆయన శ్రీరామకృష్ణుల దగ్గరకు వచ్చి ‘‘మీరు ఎప్పుడూ దేవుడు గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడున్నాడని రుజువేమిటి? అలాంటి రుజువు ఏదైనా ఉంటే నాకు చూపించండి’’ అని అడిగారు.

శ్రీరామకృష్ణులు నవ్వుతూ ‘‘దేవుడు ఉన్నాడనడానికి నేనే రుజువు’’ అన్నారు. ఆ మాటకు తక్షణమే ఏ జవాబు ఇవ్వాలో వివేకానందుడికి తెలియలేదు. అక్కడినుంచి వెళ్ళిపోయారు. మూడు రోజుల తరువాత మళ్ళీ గురువు దగ్గరకు వచ్చి ‘‘దేవుడు ఉన్నాడనడానికి మీరే రుజవని చెప్పారు. మరి నాకు దేవుణ్ణి చూపించగలరా?’’ అని ప్రశ్నించారు.


‘‘దేవుణ్ణి చూసే ధైర్యం నీకుందా?’’ అని అడిగారు శ్రీరామకృష్ణులు. ఉంది అన్నారు వివేకానందుడు.

అప్పుడు శ్రీరామకృష్ణులు తన కాలిని చాపి... ఎదురుగా కూర్చున్న వివేకానందుడి ఛాతీ మీద పాదాన్ని పెట్టి నొక్కారు. తక్షణం వివేకానందుడిలో ఏదో కలవరం కలిగింది. సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. అలా దాదాపు పన్నెండు గంటల సేపు ఆ స్థితిలోనే ఉండిపోయారు. దైవం ఉనికి గురించి సందేహంతో సహా వివేకానందుడి మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికింది. పరిపూర్ణమైన జ్ఞానం, అవగాహనతో ఆ స్థితి నుంచి బయటకు వచ్చారు.

ఆ తరువాత... వివేకానందుడు తన జీవితంలో గురువును మరో ప్రశ్న ఎప్పుడూ అడగలేదు. శ్రీరామకృష్ణుల సందేశాన్ని ప్రపంచమంతటా చాటిచెప్పారు. ‘‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువతరం ఈ దేశానికి అవసరం’’ అని ప్రకటించిన వివేకానందుడి స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ ఆయన జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా మన దేశం జరుపుకొంటోంది.


ఇవి కూడా చదవండి..

Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ

Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 31 , 2025 | 04:16 AM