Share News

మా బాబుకు కంటి సమస్య ఎందుకు

ABN , Publish Date - May 15 , 2025 | 05:42 AM

పెద్దల్లో లాగే పిల్లల్లో కూడా దృష్టి దోషాలు సహజం. ‘పిల్లలు పెరిగేకొద్దీ అన్నీ సర్దుకుంటాయిలే!’ అని నిర్లక్ష్యం చేస్తే, శాశ్వతంగా కంటి చూపే పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పిల్లల కంటి సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పిల్లల్లో...

మా బాబుకు కంటి సమస్య ఎందుకు

కౌన్సెలింగ్‌

డాక్టర్‌! మా అబ్బాయికి ఎనిమిదేళ్లు. చదువులో వెనకబడుతున్నాడు. బోర్డు మీద రాసినవి చదవలేకపోతున్నాడు. పుస్తకాలను కూడా కళ్లకు దగ్గరగా పెట్టుకుని చదువుతున్నాడు. మా బాబుకు ఉన్న కంటి సమస్య గురించి వివరిస్తారా?

- ఓ సోదరి, హైదరాబాద్‌

పెద్దల్లో లాగే పిల్లల్లో కూడా దృష్టి దోషాలు సహజం. ‘పిల్లలు పెరిగేకొద్దీ అన్నీ సర్దుకుంటాయిలే!’ అని నిర్లక్ష్యం చేస్తే, శాశ్వతంగా కంటి చూపే పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పిల్లల కంటి సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పిల్లల్లో పుట్టుకతో లేదా పెరిగే క్రమంలో కంటి సమస్యలు తలెత్తుతాయి. వీటిని తేలికగానే కనిపెట్టవచ్చు. కొన్ని సమస్యలు కనుగుడ్లలో స్పష్టంగా కనిపిస్తే, ఇంకొన్ని పిల్లలు ప్రవర్తన ద్వారా బయల్పడుతూ ఉంటాయి. దూరం లేదా దగ్గరి వస్తువులు కనిపించని సమస్య ‘రిఫ్రాక్టివ్‌ ఎర్రర్స్‌’. ఈ సమస్య వల్ల పిల్లలు పుస్తకాన్ని కళ్లకు దగ్గరగా పెట్టుకోనిదే చదవలేకపోతూ ఉంటారు. టివి లేదా బ్లాక్‌బోర్డు దగ్గరకు వెళ్లి చూడడం చేస్తూ ఉంటారు. కంటిచూపు తక్కువగా ఉండడం మూలంగా ఆటలకు కూడా పిల్లలు దూరంగా ఉంటూ ఉంటారు. ఎక్కువ సమయాల పాటు తోటి పిల్లలతో కలవకుండా, అంతర్ముఖులుగా ఇళ్లకు, తమ గదులకే పరిమితమైపోతూ ఉంటారు. చదువులో కూడా వెనకపడిపోతూ ఉంటారు. పిల్లల్లో ఈ లక్షణాలను గమనించినప్పుడు ఆలస్యం చేయకుండా కంటి వైద్యుల చేత పరీక్ష చేయించాలి. కళ్లలో సమస్య ఉందని తేలినప్పుడు, కళ్లజోడు వాడుకోవలసి ఉంటుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే, పిల్లల కంటిచూపు బాగా దెబ్బతిని, అంధత్వం వచ్చే అవకాశం ఉంటుంది.


కంటి నంచి మెదడుకు సిగ్నల్స్‌ అందక కన్ను లేజీ ఐగా మారి, ‘ఆంబ్లియోపియా’ అనే పరిస్థితి తలెత్తుతుంది. ఈ సమస్యను చికిత్సతో చక్కదిద్ది, కంటిచూపును మెరుగు పరచడం కష్టం. కాబట్టి సమస్యను ఎంత త్వరగా గుర్తించి, చికిత్స ఇప్పిస్తే, అంతగా మెరుగ్గా కంటిచూపును కాపాడుకోగలిగిన వాళ్లం అవుతాం.

డాక్టర్‌ మాధవి ఘంటా,

కంటి వైద్యులు, ఖమ్మం

ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్

Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్

Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 15 , 2025 | 05:42 AM