Share News

Mono Diet: బరువు తగ్గించే ‘మోనో డైట్‌’

ABN , Publish Date - Feb 18 , 2025 | 04:12 AM

బరువు తగ్గడానికి ఎన్నో కొత్త కొత్త పోకడలు వాడుకలోకొస్తూనే ఉన్నాయి. తాజా ‘మోనో డైట్‌’ విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. దీంతో ఒరిగే లాభనష్టాల గురించి తెలుసుకుందాం!

Mono Diet: బరువు తగ్గించే ‘మోనో డైట్‌’

రువు తగ్గడం కోసం ఒకే రకమైన పదార్థాలను తినడమే... మోనోట్రోపిక్‌ డైట్‌. ఈ తరహా డైట్‌తో బరువు తగ్గినా అది తాత్కాలికం కావచ్చు. దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని నష్టపరచవచ్చు. ఈ డైట్‌ను అనుసరించడం కోసం ఒకే పదార్థానికి దీర్ఘకాలం పాటు కట్టుబడి ఉండాలి. అరటిపండ్లు ఎంచుకునే అరటిపండే తినాలి. కొందరు బంగాళాదుంపలు, గుడ్లు కూడా ఎంచుకుంటూ ఉంటారు. అవి తప్ప వేరే పదార్థాలేవీ తినకూడదు. ఇలా క్యాలరీల మీద కోత విధించే మోనో డైట్‌ వల్ల బరువు తగ్గే ప్రక్రియ వెంటనే మొదలైపోతుంది. అయితే ఒంట్లో నీటి శాతం తగ్గడం, కండర క్షీణత వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉందనే విషయం గుర్తుంచుకోవాలి. బరువు తగ్గడంతో కూడా నీరసం, నిస్సత్తువలు కూడా వేధిస్తాయి.


దుష్ప్రభావాలు

మోనో డైట్‌లో భాగంగా పోషకాల కొరత ఏర్పడడం వల్ల ఆహారం మీద వ్యామోహం పెరుగుతుంది. దాంతో అవసరానికి మించి తినే ప్రమాదం ఉంటుంది. పోషక లోపం వల్ల గాల్‌స్టోన్స్‌, ఎలకొ్ట్రలైట్‌ అసమతౌల్యం, మలబద్ధకం, తలనొప్పి, నీరసం, పోషకలోపాలు, కండర క్షీణతలు వేధిస్తాయు. మరీ ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం, హృద్రోగాలు లాంటి ఆరోగ్య సమస్యలున్నవారు వైద్యులను సంప్రతించకుండా మోనో డైట్‌ను అనుసరించకూడదు.


ఇవి కూడా చదవండి..

గోల్డ్‌ బాండ్లకు గుడ్‌బై..

ఎస్‌బీఐ రిటైల్ లోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లల్లో కోత!

గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు

మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 18 , 2025 | 04:12 AM