Ayurveda: కంద అందరికీ మంచిదే!
ABN , Publish Date - Feb 15 , 2025 | 05:42 AM
ఇక ఆయిర్వేద గ్రంధాల్లో కందకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. అడవుల్లో దొరికే కంద దుంపలను ఆయిర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. సాధారణంగా కంద రెండు రంగుల్లో లభిస్తుంది.
ఒకప్పుడు ఋషులు కందమూలాలు తిని బతికారని చెబుతారు. ఎలాంటి ఆహార సౌకర్యం లేకపోయిన ప్రాంతాల్లో కూడా కంద దొరికేదని దీని అర్ధం. ఇక ఆయిర్వేద గ్రంధాల్లో కందకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. అడవుల్లో దొరికే కంద దుంపలను ఆయిర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. సాధారణంగా కంద రెండు రంగుల్లో లభిస్తుంది. ఆయిర్వేద గ్రంధాల్లో ఎర్రకందని రక్తసూరణ అనీ, తెల్ల కందని శ్వేత సూరణ అనీ పిలుస్తారు. పైన పెచ్చు తీసేస్తే లోపలి కండ తెల్లగా ఉన్నది ఎక్కువ రుచికరం. లేత ఎరుపు లేదా గులాబీ రంగులో ఉన్నది కూడా తినదగిందే! అయితే ఈ మధ్య కాలంలో కందను తినేవారి సంఖ్య తక్కువగా ఉంటోంది. కానీ భోజన కుతూహలం గ్రంధం మాత్రం కందకు ఉన్న గుణాలను వివరించింది. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
కంద శరీరంలో వేడిని పెంచుతుంది. జాఠరాగ్నిని ప్రజ్వరిల్ల చేస్తుంది. తరచూ కందని తినే వారికి జీర్ణశక్తి బలంగా ఉంటుందని అర్థం.
జఠరాగ్ని బలంగా ఉంటే వాతం, కఫం, పైత్యం కూడా అదుపులో కొస్తాయి.
జఠరాగ్ని మందంగా ఉన్నవారికి ఆయాసం, ఉబ్బసం, దగ్గు, ఎలర్జీవ్యాధులు కలుగుతాయి. జాఠరాగ్ని వలన ఈ వ్యాధులు నివారణ అవుతాయి. కంద తింటే కఫ వ్యాధి నశిస్తుంది.
అడవి కందకు మొలల వ్యాధిని నివారించే ఔషధ గుణాలు ఉన్నాయి. మొలలవ్యాధి ఉన్నవారు కందని తరచూ కూరగా వండుకోవటం, లేదా అంగుళం పరిమాణం ఉన్న కందముక్కలు రెండు మూడు తీసుకుని జ్యూసు చేసుకుని తాగుతూ ఉంటే మొలల ఉధృతి ఆగుతుంది
కంద ఆకుల్ని కూడా కూరగా వండుకుని తినవచ్చు. కందకున్న గుణాలన్నీ ఆకులకూ ఉన్నాయి.
కంద దుంపని ఎలిఫెంట్ ఫూట్ (యామ్) అని పిలుస్తారు. ఏనుగు పాదంలా ఉంటుందని ఆ పేరు వచ్చించి. ముఖ్యమైన విషయం ఏమంటే ఏనుగుపాదంలా కాళ్లు తయారయ్యే వ్యాధిని ఎలిఫెంటియాసిస్ (బోదవ్యాధి) అంటారు. కందకు ఈ వ్యాధి పైన పనిచేసే శక్తి ఉంది. కంద దుంపలోపలి కండను మెత్తగా మిక్సీ పట్టి నెయ్యి కలిపి బోదకాలుపైన రోజూ ఎనిమిది సార్లు లేపనం చేస్తూంటే వాపు కరుగుతుంది.
నెలసరి సరిగా రాని స్త్రీలకు దీన్ని తరచూ ఆహారంగా ఇస్తుంటే ఋతుక్రమం సరి అవుతుంది. దగ్గు, ఉబ్బసాలకు ఇది మంచి నివారకం. దీనిపైన ఉండే మట్టితోసహా మంటలో వేసి బూడిద చేసి ఆ బూడిదని ఒక చెంచాడంత తీసుకుని పాలలోనో నీళ్ళలోనో కలిపి తాగుతుంటే కడుపులో ఏర్పడే గడ్డలు కరుగుతాయి.
పురుషుల్లో జీవకణాలను పెంచే శక్తి కందకుంది. ఆహారాన్ని వంటబట్టిస్తుంది పోషకాలు ఇమిడేలా చేస్తుంది. తద్వారా నీరసం నిస్సత్తువల్ని తగ్గిస్తుంది. దోషాలను ఊడ్చి శరీరాన్ని శుభ్రం చేసే పాత్ర కందది.
గంగరాజు అరుణాదేవి
ఇవి కూడా చదవండి...
PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు
CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ
Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.