శిరోజాల కోసం తులసి
ABN , Publish Date - Jul 02 , 2025 | 03:45 AM
తులసి ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే. ఈ తులసి ఆకులు శిరోజాలకూ పోషణనిస్తాయి. ఆ వివరాలివీ..
తులసి ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే. ఈ తులసి ఆకులు శిరోజాలకూ పోషణనిస్తాయి. ఆ వివరాలివీ..
తులసి ఆకులను ఎండబెట్టి పొడి చేయాలి. కొబ్బరి నూనెలో రెండు స్పూన్లు ఈ పొడిని వేసి సన్నని మంట మీద పెట్టాలి. నూనె వేడయ్యాక కొన్ని మెంతులు వేసి మరికొంతసేపు వేడి చేయాలి. చల్లారాక ఆ నూనెను మాడుకు పట్టించాలి. రెండు గంటల తరువాత తలస్నానం చేయాలి. దీనివల్ల చుండ్రు, తలలో ఉండే చిన్న కురుపులు, దురద వంటి సమస్యలు దూరమవుతాయి.
రెండు టేబుల్ సూన్ల మెంతులను రాత్రంతా నానబెట్టాలి. ఉదయం తులసి ఆకులు, టేబుల్ స్పూన్ పెరుగు వేసి ఆ మెంతులను మెత్తని పేస్టులా రుబ్బి తలకు మాస్క్ వేయాలి. అరగంట తరువాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే కుదుళ్లు బలంగా మారుతాయి.
కొన్ని తులసి ఆకులను రుబ్బి, అందులో కలబంద గుజ్జును కలిసి మాడుకు, జుట్టుకు పట్టించి అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీని వలన చుండ్రు తగ్గడంతో పాటు కేశాలు మృదువుగా మారుతాయి.
కొన్ని తులసి ఆకులు, కొన్ని వేప ఆకులు తీసుకుని మెత్తగా రుబ్బాలి. ఆ పేస్టులో ఒక స్పూన్ నిమ్మరసం కలిసి తలకు బాగా పట్టించి అయిదు నిమిషాలు మర్దన చేయాలి. పావుగంట తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే మాడుకు అంటి ఉన్న బ్యాక్టీరియా తొలగిపోయి దురద వంటి సమస్యలు తగ్గుతాయి.
ఇవి కూడా చదవండి:
వైఎస్ జగన్‌కు సోమిరెడ్డి వార్నింగ్
బీఆర్ఎస్ పునరుజ్జీవనం కోసం తాపత్రయపడుతోంది: సీఎం రేవంత్ రెడ్డి..
సినీ నటి పాకీజాకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం
For More AP News and Telugu News