Share News

Brahma: అదే శాశ్వతం

ABN , Publish Date - Feb 28 , 2025 | 03:57 AM

తన వాహనమైన హంస మీద బ్రహ్మదేవుడికి కోపం వస్తే... కలువలతో నిండిన సరస్సులో అది విహరించకుండా నిరోధించగలడేమో! కానీ పాలను, నీటిని వేరు పరచగలిగే దాని సామర్థ్యాన్ని మాత్రం పోగొట్టలేడు.

Brahma: అదే శాశ్వతం

వనజభవుండు కోపమున వాహనమైన మరాళభర్తకున్‌

వనజవనీ విహార కలనంబు దొలంగగ జేయు గాని గుం

భనమున దుగ్ధజీవన విభాగ విధాన నిరూఢనైపుణీ

జనిత మహాయశోవిభవ సారము హంసకు మాన్పజాలునే

భర్తృహరి ‘నీతి శతకం’లోని ‘అమ్భోజినీ వనవిహార విలాసమేవ...’ అనే శ్లోకానికి ఏనుగు లక్ష్మణకవి తెలుగులో చేసిన అనుసృజన ఇది.

భావం: తన వాహనమైన హంస మీద బ్రహ్మదేవుడికి కోపం వస్తే... కలువలతో నిండిన సరస్సులో అది విహరించకుండా నిరోధించగలడేమో! కానీ పాలను, నీటిని వేరు పరచగలిగే దాని సామర్థ్యాన్ని మాత్రం పోగొట్టలేడు. అంటే... ఎంత అధికారంలో ఉన్నవారైనా... తమ దగ్గర పనిచేసేవారిని, తమ ఆశ్రితులను ఇబ్బందులు పెట్టగలరు, నియంత్రించగలరు. కానీ వారిలో ఉన్న ప్రతిభను నాశనం చేయలేరు. అది శాశ్వతం, అదే శాశ్వతం.


మరిన్ని తెలుగు వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: గిన్నిస్ రికార్డులు సృష్టించిన మహాకుంభ మేళ

Also Read: ప్యూర్ ఈవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్

For National News And Telugu News

Updated Date - Feb 28 , 2025 | 03:57 AM