Pearl Jewelry: ముత్యాలతో మురిపెంగా...
ABN , Publish Date - Feb 10 , 2025 | 03:59 AM
కొత్త ఫ్యాషన్లు ఎన్ని వచ్చినా... ముత్యాల నగలపై మహిళలకుండే మక్కువ తగ్గదు. సాధారణంగా ఉంటూ చూడగానే ఆకట్టుకునే ముత్యాల ఆభరణాలు అన్ని వయసులవారికీ అందంగా నప్పుతాయి. రోజువారీ పెట్టుకోవడానికి వీలుగా ఉండే ట్రెండీ ‘ముత్యాల నగలు’ ఇవే...

లాకెట్: తెల్లని సీజెడ్ రాయికి అంతకన్నా పెద్ద సైజు ముత్యాన్ని జోడించి లాకెట్‌లా రూపొందిస్తారు. దీనిని సన్నని బంగారు గొలుసుకి అమరుస్తారు. ఈ ముత్యం గొలుసు మెడ వరకు వస్తుంది. అన్ని రకాల దుస్తుల మీద చక్కగా అమరుతుంది. టీషర్ట్, జీన్స్ లాంటి మోడరన్ దుస్తులు ధరించే యువతులకు బాగుంటుంది.
బ్రాస్‌లెట్: అంత చిన్నవి కాకుండా కొద్దిగా పెద్ద ముత్యాలను మందపాటి దారంతో కూర్చి బ్రాస్‌లెట్‌ను తయారు చేస్తారు. ఈ ముత్యాల బ్రాస్‌లెట్‌ను చేతికి పెట్టుకుంటే ధరించిన డ్రెస్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నేవీ బ్లూ, ముదురు గులాబీ, లావెండర్ రంగు దుస్తుల మీద హుందాగా ఉంటుంది. దీనిని ఉద్యోగినులు ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు.
ఉంగరం: శ్వేత వర్ణంలో మెరిసే ముత్యాన్ని బంగారు ఉంగరంలో అమరుస్తారు. ఈ ముత్యపు ఉంగరం సంప్రదాయ దుస్తులతోపాటు ఆధునిక దుస్తుల మీద కూడా రాయల్‌గా కనిపిస్తుంది. కాలేజీ యువతులనుంచి మధ్య వయసు మహిళల వరకు అందరూ ఈ ఉంగరాన్ని ఎంపిక చేసుకుంటున్నారు.
కమ్మలు: ముత్యాలతో రూపొందించిన వివిధ రకాల డ్రాప్స్, స్టడ్స్, హూప్స్, రింగ్స్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగినులతోపాటు గృహిణులు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు వీటిని పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎలాంటి ముఖాకృతికైనా ఈ ముత్యాల కమ్మలు సొగసును అందిస్తాయి.
ఇవి కూడా చదవండి..
Delhi CM: ఢిల్లీ సీఎం అతిషి రాజీనామా.. అసెంబ్లీ రద్దు
Delhi CM: ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఢిల్లీని బీజేపీ పాలించినపుడు ఏం జరిగిందంటే..
For More National News and Telugu News..