హల్దీకి ట్రెండీగా
ABN , Publish Date - Jul 06 , 2025 | 04:53 AM
వివాహానికి ముందు రోజు వధూ వరులకు విడివిడిగా జరిపించే ఓ ముఖ్యమైన కార్యక్రమం ‘హల్దీ’. దీన్నే మనం మంగళ స్నానాలు అంటూ ఉంటాం. బంధు మిత్రుల ఆనందోత్సాహాలు, కేరింతలు, డ్యాన్స్‌ల మధ్య...

సంప్రదాయం
వివాహానికి ముందు రోజు వధూ వరులకు విడివిడిగా జరిపించే ఓ ముఖ్యమైన కార్యక్రమం ‘హల్దీ’. దీన్నే మనం మంగళ స్నానాలు అంటూ ఉంటాం. బంధు మిత్రుల ఆనందోత్సాహాలు, కేరింతలు, డ్యాన్స్‌ల మధ్య చాలా సరదాగా కోలాహలంగా సాగుతుంది ఈ ప్రోగ్రామ్. ముఖ్యంగా అమ్మాయి ఇంట జరిగే హంగామా అంతా ఇంతా కాదు. మధ్యలో ఫొటోలు, వీడియోలు అంటూ ఫొటోగ్రాఫర్ల సందడి ఉండనే ఉంటుంది. అందుకే ఈ హాల్డీ ప్రోగ్రామ్‌లో అందంగా కనిపించేందుకు ప్రత్యేకమైన లెహంగాలను ఎంచుకుంటున్నారు కాబోయే పెళ్లికూతుళ్లు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సరికొత్త లెహంగాలు ఇవే...
లెహంగానే కావాలి
ఒకప్పుడు హల్దీ అనగానే పసుపు లేదా తెలుపు రంగు లంగా-ఓణి లేదంటే చీర ధరించేవారు. క్రమంగా ట్రెండ్ మారుతూ వచ్చింది. ఇండో వెస్ట్రన్ శైలిని ప్రతిబింబించే ఆర్గంజా, నెట్టెడ్, క్రేప్, జార్జెట్ లెహంగాలను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మల్టీకలర్, ఫ్లోరల్ డిజెన్లనూ ఆదరిస్తున్నారు. హల్దీ ప్రోగ్రామ్‌లో పసుపుకు ఉన్న ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తాము ధరించే డ్రెస్‌లో పసుపు రంగు ఉండేలా చూసుకుంటున్నారు. లేత రంగు లెహంగా మీద పసుపు డిజైన్ ఉండేవాటిని ఎంపిక చేసుకుంటున్నారు. లెహంగా ఏ రంగులో ఉన్నప్పటికీ వాటిమీద పసుపు రంగు టాప్ ధరించి మురిసిపోతున్నారు. ప్రస్తుతం ‘మల్టీ కలర్డ్ ఖాలీ’ లెహంగాలు సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి.
రఫెల్స్
నెట్టెడ్ క్లాత్‌ని కుచ్చులు కుచ్చులుగా చేర్చి దానితో లెహంగా, బ్లౌజ్ రూపొందిస్తారు. లేత నీలం, లేత గులాబీ, లేత ఆకుపచ్చ రంగులతో పాటు పసుపు రంగును కూడా మేళవించడం వల్ల హల్దీ ప్రోగ్రామ్ శోభ ఉట్టిపడుతుంది. స్టయిల్‌గా కూడా కనిపిస్తుంది.
రఫెల్ బ్లౌజ్‌కు పూర్తిగా కాంట్రాస్ట్ కలర్‌లో ఉన్న లెహంగాను ధరించడం ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్.
తెల్లని లంగా-ఓణి
వివాహ ప్రక్రియలో సంప్రదాయం పాటించాలనుకునే వారు తెల్లని లంగా-ఓణి ధరించడానికి ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు ఇదే సంప్రదాయం ఉండేది. మళ్లీ ఈ పోకడ ప్రారంభమైంది. జార్జెట్ లేదా ఆర్గంజా ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన బ్లౌజ్, లంగా, ఓణీల మీద.... వాటి అంచులకు పసుపు రంగు పూలు, మామిడి పిందెలు, చుక్కలను డిజైన్ చేయించుకుంటున్నారు. ముత్యాలతో రూపొందించిన గాజులు, హారం, ఉంగరాలు, జుంకాలు, పాపిడి బిళ్ల ధరించి అందంగా మెరిసిపోతున్నారు.
నెట్టెడ్ లెహంగాలు
ఇవి దక్షిణాది శైలిని ప్రతిబింబిస్తాయి. లెహంగా మొత్తం పలు లేయర్లుగా ఉంటుంది. ఒక్కో లేయర్ ఒక్కో రంగులో ఉంటుంది. ఇంద్రధనుస్సు రంగులతో లెహంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. భుజం మీదుగా జాలువారే కేప్ దుపట్టా ప్రత్యేకమైన అందాన్నిస్తుంది. ఈ నెట్టెడ్ లెహంగాల మీద లేత రంగు పాస్టెల్ బ్లౌజ్‌లు చక్కగా అమరుతాయి. వీటి మీద ముత్యపు చిప్పలు, గవ్వలు, శంఖులతో రూపొందించిన నగలు వేసుకోవడం నేటి సరికొత్త ఫ్యాషన్.
ఖ్యాతి,
ఖ్యాతి డిజైనర్ స్టూడియో
హైదరాబాద్, Cell : 6300386749
ఈ వార్తలు కూడా చదవండి.
రాష్ట్రంలో.. ఇక స్మార్ట్ రేషన్ కార్డులు
కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పీఎస్‌కు మాజీ మంత్రి
Read Latest Telangana News and National News