Share News

అందమంతా బ్లౌజ్‌ డిజైన్‌లోనే

ABN , Publish Date - Jun 29 , 2025 | 04:20 AM

ఈ మధ్యకాలంలో చీరల కన్నా బ్లౌజ్‌లకు ఎక్కువ ప్రాముఖ్యత లభిస్తోంది. ప్రతి పండుగ సీజన్‌కూ కొత్త కొత్త డిజైన్‌లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి...

అందమంతా బ్లౌజ్‌ డిజైన్‌లోనే

ఈ మధ్యకాలంలో చీరల కన్నా బ్లౌజ్‌లకు ఎక్కువ ప్రాముఖ్యత లభిస్తోంది. ప్రతి పండుగ సీజన్‌కూ కొత్త కొత్త డిజైన్‌లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న డిజైన్‌లు ఏమిటో చూద్దాం..

సన్నగా ఉన్నవారికి...

  • బ్లౌజ్‌ చేతులు చిన్నగా ఉంటేనే బాగుంటుంది.

  • బోట్‌ నెక్‌, కాలర్‌ నెక్‌, హైనెక్‌లు బాగా నప్పుతాయి. ఇవి వేసుకుంటే లావుగా కనబడతారు.

  • బుట్టచేతులు కూడా బాగుంటాయి. చీరకు ప్రత్యేకమైన అందాన్నిస్తాయి.

  • సన్నని చారలు ఉన్న బ్లౌజ్‌లు.... ఆకర్షణీయంగా ఉంటాయి.

బొద్దుగా ఉన్నవారికి..

  • డీప్‌ నెక్‌ కుట్టించుకుంటే బాగుంటుంది. దీని వల్ల సన్నగా కనబడతారు.

  • వీలైనంత వరకు హైనెక్‌, బోట్‌నెక్‌లు కుట్టించుకోకుండా ఉంటే మంచిది.

  • బ్లౌజ్‌ చేతులు పొడవుగా ఉంటే హుందాగా కనిపిస్తారు.

  • వీరికి బుట్టచేతులు నప్పవు.


111-navya.jpg

నెట్టెడ్‌ బ్లౌజ్‌లు

ఈ తరహా బ్లౌజ్‌లలో చేతులకు.. వెనక భాగానికి నెట్టెడ్‌ క్లాత్‌ను ఉపయోగిస్తారు. వీటిపై జర్దోసి, జరీ వర్క్‌లను కూడా చేయిస్తారు. సాధారణంగా హైనెక్‌నే కుడతారు. మిగిలిన బ్లౌజ్‌లతో పోలిస్తే వీటి ఖరీదు ఎక్కువ. కుట్టడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. నెట్టెడ్‌ బ్లౌజ్‌లు సన్నగా ఉన్నవారికి బాగా నప్పుతాయి. ఈ బ్లౌజ్‌లపై మెడను పట్టి ఉండే చోకర్స్‌ కన్నా.. మామూలు నెక్లెస్‌లు అందంగా అమరుతాయి.

ఇండో వెస్ట్రన్‌ బ్లౌజ్‌లు

ఒక వైపు సంప్రదాయం.. మరో వైపు ఆధునికతలను ఈ ఇండో వెస్ట్రన్‌ బ్లౌజ్‌లు ప్రతిబింబిస్తాయి. డోరీ, హాల్టర్‌నెక్‌, మహారాణి నెక్‌, కాలర్‌నెక్‌లు ఈ బ్లౌజ్‌ల ప్రత్యేకత. బ్యాక్‌లెస్‌ బ్లౌజ్‌లు ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చాయి. హల్దీ, మెహందీ ఫంక్షన్లలో వీటిని ఎక్కువగా ధరిస్తున్నారు.


222-navya.jpg

రాసిల్క్‌ బ్లౌజ్‌లు

రాసిల్క్‌ బ్లౌజ్‌ గుడ్డలు.... అనేక రంగుల్లో మనకు లభిస్తాయి. వీటిని తెచ్చుకుని బ్లౌజ్‌లు కుట్టించి వాటిపై జర్దోసి, జరీ, కర్దానా, స్టోన్‌ వర్క్‌లను చేయిస్తున్నారు. సాధారణంగా పెళ్లి సమయంలో ఇలాంటి బ్లౌజ్‌లను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఈ బ్లౌజ్‌ డిజైన్‌లలో రాళ్లు, జరీదారాల పనితనం ఉంటుంది కాబట్టి ఖరీదు కూడా ఎక్కువే!

ఖ్యాతి, హైదరాబాద్‌,

6300386749

ఇవి కూడా చదవండి

పాత బాకీ అడిగితే ఇలా కొడతారా..

మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, లోకేష్

Updated Date - Jun 29 , 2025 | 04:21 AM