Tips to Remove Hair Dye: తల రంగు మరకలా
ABN , Publish Date - Oct 06 , 2025 | 05:23 AM
మనలో చాలామంది తలకు రంగు వేసుకుంటూ ఉంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నుదుటిమీద, మెడ చుట్టూ నల్లని రంగు మరకలు ఏర్పడుతుంటాయి. వీటిని సులభంగా వదిలించే చిట్కాల...
మనలో చాలామంది తలకు రంగు వేసుకుంటూ ఉంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నుదుటిమీద, మెడ చుట్టూ నల్లని రంగు మరకలు ఏర్పడుతుంటాయి. వీటిని సులభంగా వదిలించే చిట్కాల గురించి తెలుసుకుందాం...
రెండు చుక్కల మేకప్ రిమూవర్ లేదా నెయిల్ పాలిష్ రిమూవర్‌ను చిన్న దూది వుండ మీద వేసి దానితో మరకల మీద మెల్లగా రుద్దాలి. ఆపైన గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మరకలు పోతాయి. తరవాత చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
రంగు మరకల మీద కొద్దిగా టూత్‌పేస్ట్‌ను రాయాలి. తరవాత మెత్తని చేతి రుమాలు లేదా పాత టూత్‌బ్రష్‌తో రెండు నిమిషాలపాటు రుద్దాలి. ఆపైన గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే మరకలు తొలగిపోతాయి.
మరకల మీద వైట్ పెట్రోలియం జెల్లీని రాసి చేతి వేళ్లతో మృదువుగా రుద్దాలి. తరవాత తడి గుడ్డతో తుడిచేస్తే మరకలు పోతాయి.
వెనిగర్‌లో ముంచిన దూది లేదా నిమ్మ చెక్కతో రుద్ది కూడా మరకలను వదిలించుకోవచ్చు.
చిన్న గిన్నెలో బేబీ ఆయిల్, ఎసెన్షియల్ ఆయిల్, ఆలివ్ ఆయిల్‌లలో ఒకదాన్ని తీసుకుని కొద్దిగా వేడిచేసి మరకల మీద రాయాలి. అయిదు నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే ఫలితం కనిపిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు