Kitchen Tips: ఆలుగడ్డలు నిల్వ ఉండాలంటే...
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:02 AM
బజారు నుంచి తెచ్చిన ఆలుగడ్డలు కొద్ది రోజులకే మొలకెత్తడం చూస్తుంటాం. ఇలా మొలకలు వచ్చిన ఆలుగడ్డను తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఆలుగడ్డలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవచ్చు.

ఆలుగడ్డలను గాలి తగిలేలా ఉంచాలి. నేరుగా సూర్యకాంతి పడకుండా చూసుకోవాలి. ఎండ తగిలితే ఆకుపచ్చ రంగులోకి మారి చేదుగా అవుతాయి. చీకటి ప్రదేశాల్లో ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
తేమ తగిలితే ఆలుగడ్డలు తొందరగా పాడవుతాయి. వీటిని ఫ్రిజ్‌లో కూడా పెట్టకూడదు. చల్లదనం వల్ల వాటిలోని పిండిపదార్థం చక్కెరగా మారుతుంది. దీంతో అవి సహజ రుచిని కోల్పోతాయి.
ఆలుగడ్డలను గోనె సంచులు, వెదురు బుట్టలు, కాగితం సంచుల్లో గాలి ఆడేలా నిల్వ చేయడం మంచిది. అలాకాకుండా ప్లాస్టిక్ కవర్లలో మూసి ఉంచితే మొలకలు వచ్చి తొందరగా పాడవుతాయి.
ఆలుగడ్డలను టమాటాలు, నిమ్మకాయలు, ఉల్లిపాయలు, అరటిపండ్లతో కలిపి ఉంచకూడదు. వీటి నుంచి వెలువడే ఎథిలీన్ వాయువు వల్ల ఆలుగడ్డలపై పసుపు రంగు మొలకలు వచ్చేస్తాయి. ఇలా మొలకెత్తినవాటిలో శరీరానికి హాని కలిగించే గ్లైకోఆల్కలైట్ తయారవుతుంది.
ఆలుగడ్డలను కొనేటప్పుడు గట్టిగా ఉన్నవాటినే తీసుకోవాలి. ఏమాత్రం మెత్తగా ఉన్నా అవి త్వరగా కుళ్లిపోతాయి.
కొంతమంది ఆలుగడ్డలను కొన్నతరవాత వాటిపై మట్టి ఉందని నీళ్లలో నానబెట్టి కడిగేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆలుగడ్డలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. వాటికి నీళ్లు తగలకుండా ఉంటే చాలా రోజులు తాజాగా ఉంటాయి.
ఇవి కూడా చదవండి..
Delhi CM: ఢిల్లీ సీఎం అతిషి రాజీనామా.. అసెంబ్లీ రద్దు
Delhi CM: ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఢిల్లీని బీజేపీ పాలించినపుడు ఏం జరిగిందంటే..
For More National News and Telugu News..