Increase Height After Puberty: యుక్తవయసు దాటాక కూడా
ABN , Publish Date - Oct 06 , 2025 | 05:28 AM
చాలామంది యుక్త వయసు దాటిన తరవాత ఎత్తు పెరగడం అసాధ్యం అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటించి యుక్త వయసు తరవాత కూడా కొద్దిగా ఎత్తు పెరగవచ్చని నిపుణులు...
చాలామంది యుక్త వయసు దాటిన తరవాత ఎత్తు పెరగడం అసాధ్యం అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటించి యుక్త వయసు తరవాత కూడా కొద్దిగా ఎత్తు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం...
యోగా చేసేటప్పుడు తడాసనం, వృక్షాసనం, భుజంగాసనం వేయడం వల్ల శరీరంలో కదలికలు పెరుగుతాయి. దీంతో కండరాలు, ఇతర కణజాలాలు కొద్దిగా సాగుతాయి. అలాగే ఎత్తు పెరగడానికి అవసరమయ్యే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి.
ఎత్తు పెరగడానికి స్ట్రెచింగ్ వ్యాయామాలు బాగా దోహదం చేస్తాయి. రోజూ ఎత్తులో ఉన్న రాడ్ లేదా కిటికీ ఊచలు పట్టుకుని వేలాడుతూ శరీరాన్ని సాగదీయాలి. ఏదైనా పని చేసిన తరువాత ఒళ్లు విరుచుకుంటూ ఉండాలి. వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల కూడా వీపు, నడుము భాగాల్లోని కండరాలు సాగుతాయి. తరచూ ఇవన్నీ చేస్తూ ఉంటే కొద్దిగా ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. స్కిప్పింగ్, స్విమ్మింగ్, బాస్కెట్ బాల్ ఆడడం లాంటివి మంచి ఫలితాన్నిస్తాయి.
ఎత్తు పెరగాలంటే పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రొటీన్, జింక్, కాల్షియం, విటమిన్లు, మినరల్స్ అధికంగా లభించే ఆహార పదార్థాలు తినాలి. ఇవి ఎముకలు, కండరాలను బలోపేతం చేసి ఎత్తు పెరగడానికి తోడ్పడతాయి.
శరీరం ఆరోగ్యంగా ఎదగాలంటే మంచి నిద్ర అవసరం. రోజుకు కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంటలపాటు నిద్రించడం వల్ల శరీరంలో గ్రోత్ హార్మోన్లు ఉత్పత్తయి ఎత్తు పెరగడానికి దోహదం చేస్తాయి.
నిటారుగా నిలబడి చేతులను పైకి లేపి తలపైన రెంటినీ కలపాలి. పాదాలను పైకి లేపి మునివేళ్ల మీద కొద్దిసేపు నిల్చోవాలి. ఆపై విశ్రాంతి దశకు రావాలి. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం ఇరవై సార్లు చేస్తూ ఉంటే ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు