Share News

Tips for Storing Bananas Fresh: తాజాగా ఇలా

ABN , Publish Date - Nov 24 , 2025 | 05:27 AM

అరటి పండ్లను నిల్వ చేయడం కొద్దిగా కష్టమే. తెచ్చిన రెండు రోజుల్లోనే బాగా పండి తరువాత పాడైపో తుంటాయి. చిన్న చిట్కాలు పాటించి అరటి పండ్లను ఎక్కువ రోజులు తాజాగా ఉండేలా..

Tips for Storing Bananas Fresh: తాజాగా ఇలా

అరటి పండ్లను నిల్వ చేయడం కొద్దిగా కష్టమే. తెచ్చిన రెండు రోజుల్లోనే బాగా పండి తరువాత పాడైపో తుంటాయి. చిన్న చిట్కాలు పాటించి అరటి పండ్లను ఎక్కువ రోజులు తాజాగా ఉండేలా నిల్వ చేసుకోవచ్చు.

  • వెడల్పాటి గిన్నెలో సగానికి పైగా నీళ్లు పోసి అందులో రెండు సి విటమిన్‌ మాత్రలు వేసి కరిగించాలి. ఈ నీటిలో అరటి పండ్లను ముంచి తీస్తే అవి వారంపాటు తాజాగా ఉంటాయి. పండ్లపై కొద్దిగా నిమ్మరసం రాసినా ఫలితం ఉంటుంది.

  • అరటి పండ్లు త్వరగా పండటానికి కారణం కాడల నుంచి వెలువడే ఎథిలిన్‌ వాయువు. కాడలను ప్లాస్టిక్‌ కవర్‌ లేదా అల్యూమినియం ఫాయిల్‌తో చుట్టేస్తే అయిదు రోజులపాటు అరటి పండ్లు తాజాగా ఉంటాయి.

  • అరటి పండ్లను గుత్తిగా ఉంచినట్లయితే వాటిలో ఒకటి పండినా మిగిలినవన్నీ వెంటనే మెత్తబడతాయి. కాబట్టి అరటి పండ్లను తెచ్చిన వెంటనే గుత్తి నుంచి విడదీయాలి. పండినవాటిని వేరేగా ఉంచాలి.

  • అరటి పండ్లను తాడు సహాయంతో హ్యాంగర్‌కు వేలాడదీస్తే చాలారోజుల వరకు పాడవకుండా తాజాగా ఉంటాయి.

  • అరటి పండ్లను పేపర్‌ బ్యాగ్‌లో ఉంచి వెలుతురు తగలకుండా భద్రపరిస్తే వారానికి పైగా నిల్వ ఉంటాయి.

ఇవీ చదవండి:

అన్‌క్లెయిమ్డ్‌ బీమా మొత్తాలు క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా

అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పైనే ఎక్కువ ఎఫెక్ట్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 24 , 2025 | 05:27 AM