Tips for Soft and Fluffy Idlis: ఇడ్లీలు మెత్తగా ఇలా...
ABN , Publish Date - Dec 29 , 2025 | 06:41 AM
చలికాలంలో ఇడ్లీలు మెత్తగా స్పాంజ్‌లా రావాలంటే కొన్ని చిట్కాలు, జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఆ వివరాలు...
చలికాలంలో ఇడ్లీలు మెత్తగా స్పాంజ్‌లా రావాలంటే కొన్ని చిట్కాలు, జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఆ వివరాలు...
వెడల్పాటి లోతైన గిన్నెలో వేడినీళ్లు పోసి అందులో ఇడ్లీ పిండి గిన్నెను ఉంచి పైన మూతపెడితే ఆరుగంటల్లో పిండి బాగా పొంగుతుంది. ఇలా పొంగిన పిండితో చేస్తే ఇడ్లీలు మృదువుగా వస్తాయి. పిండి గిన్నెను.. ఆఫ్ చేసిన ఓవెన్‌లో ఉంచినా మంచి పలితం కనిపిస్తుంది.
మినపగుండ్లను రుబ్బేటప్పుడు వాటిలో కొన్ని నానబెట్టిన అటుకులు వేస్తే ఇడ్లీలు తెల్లగా మెత్తగా వస్తాయి.
మినపగుండ్లలో కొన్ని మెంతులు వేసి నానబెట్టి రుబ్బితే ఇడ్లీలు మెత్తగా రుచిగా ఉంటాయి.
మినప్పిండిలో ముందుగా నానబెట్టిన ఇడ్లీ రవ్వ వేసి చేత్తో బాగా కలపాలి. పిండి పొంగిన తరువాత ఎక్కువగా కలపకూడదు.
ఇడ్లీ పిండి సరిగా పొంగనప్పుడు అందులో కొద్దిగా బేకింగ్ సోడా లేదా పుల్లటి పెరుగు వేసి కలిపితే ఫలితం ఉంటుంది.
కుక్కర్‌లో నీళ్లు పోసి అవి వేడయ్యాక ఇడ్లీ స్టాండ్ పెట్టి పది నిమిషాలు ఉడికించాలి. స్టవ్ మీదనుంచి దించిన తరువాత రెండు నిమిషాలు ఆగి ఇడ్లీలను ప్లేట్‌లోకి తీయాలి.
ఇడ్లీ పిండిలో అయొడైజ్డ్ ఉప్పు కాకుండా గళ్ల ఉప్పు లేదా పచ్చళ్లకు వాడే ఉప్పు వేసి కలిపినా ఫలితం కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి
వివాహ వేడుకలోకి అతిథుల్లా వచ్చారు.. అంతా చూస్తుండగానే..
బురదలో ఆహారం కోసం వెతుకుతున్న చిరుత.. చివరకు ముందున్న దృశ్యం చూసి..