Exam stress : పరీక్షల సమయంలో...
ABN , Publish Date - Feb 16 , 2025 | 11:35 PM
పరీక్షల సమయంలో పిల్లలు సహజంగానే ఒత్తిడి, ఆందోళనకు గురవుతూ ఉంటారు. వీటినుంచి విశ్రాంతి లభించాలంటే రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. పరీక్షలంటే భయపడకుండా పిల్లలు హాయిగా పడుకోవడానికి పాటించాల్సిన చిట్కాల గురించి తెలుసుకుందాం!
పరీక్షల సమయంలో పిల్లలు సహజంగానే ఒత్తిడి, ఆందోళనకు గురవుతూ ఉంటారు. వీటినుంచి విశ్రాంతి లభించాలంటే రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. పరీక్షలంటే భయపడకుండా పిల్లలు హాయిగా పడుకోవడానికి పాటించాల్సిన చిట్కాల గురించి తెలుసుకుందాం!
పరీక్షలు దగ్గరకు రాగానే పిల్లలు రాత్రిపూట పడుకునే సమయాన్ని నిర్దేశించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దానికి కట్టుబడి ఉండేలా చూసుకోవాలి. మరుసటి రోజు ఉదయమే నిద్రలేపాలి. లేదంటే రాత్రికి త్వరగా పడుకోరు.
పడుకునే సమయానికి రెండు గంటల ముందే భోజనం పూర్తి చేయించాలి. గంట తరవాత గోరువెచ్చని పాలు, అరటిపండు, వాల్‌నట్ లాంటివి ఇస్తే పిల్లలు వెంటనే నిద్రపోతారు.
టీ, కాఫీలను పిల్లలకు అలవాటు చేయవద్దు. వీటిలో ఉండే కెఫిన్ వల్ల సరిగా నిద్ర పట్టదు.
పడుకునే ముందు మొబైల్ లేదా టీవీని చూడనివ్వకూడదు. గదిలో వెలుతురు లేకుండా నిశ్శబ్దంగా ఉండేలా చూడాలి.
పరీక్షల గురించి అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండడాన్ని పిల్లలకు అలవాటు చేయాలి. సాయంత్రం పూట కొద్దిసేపు ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయిస్తే పిల్లలు వెంటనే నిద్రపోతారు.
బడిలో చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు చదువుకుంటూ హోమ్ వర్క్‌లు పూర్తిచేసేలా పిల్లలను ప్రోత్సహించాలి. దీనివల్ల పరీక్షలంటే ఆందోళన తగ్గి ప్రశాంతంగా పడుకుంటారు.
తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు, తాజా పళ్లు, కూరగాయలతో పాటు పోషకాహారాన్ని పిల్లలకు తినిపించాలి. ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే పిల్లలు ప్రశాంతంగా నిద్రించగల్గుతారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. పరీక్షలు బాగా రాస్తారు.
ఇవి కూడా చదవండి...
Maha Kumbh 2025: కుంభమేళాకు అర్థమే లేదు.. లాలూ వివాదాస్పద వ్యాఖ్యలు
Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణం ఇదేనా?
Maharashtra: మహారాష్ట్రలో లవ్ జిహాద్ నియంత్రణకు చట్టం!
Ranveer Allahbadia: చంపుతామంటూ బెదిరిస్తున్నారు.. ఇన్‌స్టా పోస్ట్‌లో రణ్‌వీర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.