Share News

ఐఐఎమ్‌లు అందించే ఉచిత కోర్సులు ఇవే

ABN , Publish Date - Feb 24 , 2025 | 05:58 AM

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లు పలు విభాగాలకు సంబంధించిన ఉచిత కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సుల గురించి కేంద్రప్రభుత్వం నిర్వహించే ‘స్వయం పోర్టల్‌’...

ఐఐఎమ్‌లు అందించే ఉచిత కోర్సులు ఇవే

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లు పలు విభాగాలకు సంబంధించిన ఉచిత కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సుల గురించి కేంద్రప్రభుత్వం నిర్వహించే ‘స్వయం పోర్టల్‌’ (https://swayam.gov.in/)

బిజినెస్‌ కమ్యూనికేషన్‌ ఎసెన్షియల్స్‌: ఇది ఐఐఎం బెంగళూరు అందించే 6 వారాల కోర్సు. ఉద్యోగ, వ్యాపారాల్లోని సవాళ్లను ఎదుర్కునేలా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పెంపొందిస్తారు. 2025 మే 18 నుంచి క్లాసులు మొదలవుతాయి. 2025 ఫిబ్రవరి 28 వరకు నమోదు కావచ్చు.

బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ మార్కెట్స్‌: రిస్క్‌ మేనేజ్‌మెంట్‌పై ఐఐఎం బెంగళూరు అందించే ఈ కోర్సు కాలవ్యవధి ఆరు వారాలు. ఎన్‌రోల్‌మెంట్‌ 2025 ఫిబ్రవరి 28 వరకు చేసుకోవచ్చు.

ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌ అడ్వాన్స్‌డ్‌ టాపిక్స్‌: ఐఐఎం షిల్లాంగ్‌ అందించే ఆరు వారాల కోర్సు ఇది. మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు ఉపయోగం.

స్ట్రాటజిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌: ఇది 8 వారాల కోర్సు. ఐఐఎం బెంగళూరు అందిస్తోంది.

వాల్యుయేషన్‌ అండ్‌ క్రియేటింగ్‌ సస్టయినబుల్‌ వాల్యూ: వాల్యుయేషన్‌ మెథడ్స్‌, ఎలా వాల్యుయేషన్‌ చేయాలో ఉదాహరణలతో సహా వివరిస్తారు. ఐఐఎం బెంగళూరు అందించే ఆరు వారాల కోర్సు ఇది. 2025 ఫిబ్రవరి 28 తేదీ వరకు ఎన్‌రోల్‌ చేసుకోవచ్చు.


డిజిటల్‌ మార్కెటింగ్‌: ఐఐఎం బెంగళూరు నిర్వహించే ఆరు వారాల కోర్సు ఇది. డిజిటల్‌ ఇన్‌బౌండ్‌, ఔట్‌బౌండ్‌ మార్కెటింగ్‌, లీవరేజింగ్‌ సోషల్‌ మీడియా, కస్టమర్‌ ఇన్‌సైట్స్‌ తదితరాలు నేర్పిస్తారు. 2025 ఫిబ్రవరి 28 తేదీలోపు నమోదు చేసుకోవాలి.

హెచ్‌ఆర్‌ఎం స్ట్రాటజీ ఎగ్జిక్యూషన్‌: ఐఐఎం అహ్మదాబాద్‌ నిర్వహిస్తున్న ఆరు వారాల కోర్సు. 2025 ఫిబ్రవరి 28 తేదీలోపు నమోదు చేసుకోవాలి.

డేటా డ్రైవెన్‌ మార్కెటింగ్‌ డెసిషన్‌ మేకింగ్‌: మార్కెటింగ్‌ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఐఐఎం విశాఖపట్నం డిజైన్‌ చేసిన 8 వా రాల కోర్సు ఇది. కొనుగోళ్లను ప్రభావితం చేసే అంశాలను బోధిస్తారు.

ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌ అండ్‌ అనాల్సిస్‌: ఐఐఎం బెంగళూరు డిజైన్‌ చేసిన కోర్సు. ఫైనాన్షియల్‌ కాన్సెప్ట్స్‌, ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్‌, అకౌంటింగ్‌ స్టాండెడ్స్‌ తదితరాలు ఇందులో ఉంటాయి.

జనరేటివ్‌ ఏఐ, లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌: ఐఐఎం బెంగళూరు అందించే 8 వారాల కోర్సు. 2025 ఫిబ్రవరి 28 తేదీలోపు నమోదు చేసుకోవాలి.



Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 24 , 2025 | 05:58 AM