Makhana Nutritional Benefits: పోషకాల ఖజానా
ABN , Publish Date - Nov 24 , 2025 | 05:25 AM
తామరగింజలను సేకరించి ఎండబెట్టి వేయించి మఖానాను తయారుచేస్తారు. దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. చలికాలంలో తినదగ్గ చిరుతిండి...
తామరగింజలను సేకరించి ఎండబెట్టి వేయించి మఖానాను తయారుచేస్తారు. దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. చలికాలంలో తినదగ్గ చిరుతిండి.
మఖానాలో పీచుపదార్థాలు ఎక్కువ. తరచూ మఖానాను తినడంవల్ల జీర్ణసమస్యలు దూరమ వుతాయి. మలబద్దకం, కడుపు ఉబ్బరం, కడుపులో ఆమ్లత్వం లాంటి సమస్యలు తొలగిపోతాయి.
వీటిలోని ప్రొటీన్ జీవక్రియలను వేగవంతం చేస్తుంది. అతిగా తినాలనే భావన తగ్గిస్తుంది. దీనిలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి శరీరం బరువు పెరగకుండా నియంత్రణలో ఉంటుంది.
అల్పాహారంలో మఖానాను చేర్చుకుంటే శరీరానికి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, పాస్ఫరస్ లభిస్తాయి. దీంతో శరీరంలోని ఎముకలు బలోపేతమవుతాయి. కీళ్లు, కండరాల సమస్యలు తీరుతాయి.
మఖానాలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి దీన్ని మధుమేహం ఉన్నవారు తింటే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
మఖానాలో ఫ్లవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటా యి. ఇవి శరీరంలో హార్మోన్ల సమతు ల్యతను కాపాడతాయి. మహిళల్లో ల్యుకోరియా, రుతు సమస్యలను నివారిస్తాయి.
ఇవీ చదవండి:
అన్‌క్లెయిమ్డ్ బీమా మొత్తాలు క్లెయిమ్ చేసుకోవడం ఎలా
అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పైనే ఎక్కువ ఎఫెక్ట్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి