Share News

Teachings of Buddha: బుద్ధ దేవుని ధర్మ బోధ

ABN , Publish Date - Aug 29 , 2025 | 01:14 AM

బౌద్ధ సాహిత్యంలో జాతక కథలకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ కథలలో బౌద్ధ ఽధర్మ సూత్రాలు... నైతికతను, తాత్త్వికతను సులభమైన భాషలో అందిస్తాయి. బౌద్ధం ప్రపంచవ్యాప్తం కావడం వెనుక ఈ కథల పాత్ర ఎంతో ఉంది. బౌద్ధ గ్రంథమైన ‘ఖుద్ధక నికాయం’లో...

Teachings of Buddha: బుద్ధ దేవుని ధర్మ బోధ

వ్యాసపీఠం

బౌద్ధ సాహిత్యంలో జాతక కథలకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ కథలలో బౌద్ధ ఽధర్మ సూత్రాలు... నైతికతను, తాత్త్వికతను సులభమైన భాషలో అందిస్తాయి. బౌద్ధం ప్రపంచవ్యాప్తం కావడం వెనుక ఈ కథల పాత్ర ఎంతో ఉంది. బౌద్ధ గ్రంథమైన ‘ఖుద్ధక నికాయం’లో 547 జాతక కథలు మనకు లభిస్తాయి. ‘పాళీ’ భాషను నేర్చుకొని, ఆ కథలను అధ్యయనం చేసిన ప్రముఖ రచయిత బొర్రా గోవర్ధన్‌... వీటిలో 275 కథలను- తనదైన శైలిలో తెలుగువారికి నివేదించారు. ‘ఆంధ్రజ్యోతి’తో పాటు వివిధ పత్రికల్లో ప్రచురినమైన ఆ కథలను ‘ధర్మతేజం’, ‘ధర్మదీపం’, ‘ధర్మవీణ’ అనే మూడు సంపుటాలుగా ప్రచురించారు. ఈ కథలన్నీ బౌదఽ్ధ సంప్రదాయంలో విస్తృత ప్రచారంలో ఉన్నవే! వాటిని గోవర్ధన్‌ అందరికీ అర్థమయ్యేలా, సరళమైన రీతిలో అందించారు. ప్రాచీనమైన ఆ కథల్లోని నీతిని ఆధునిక జీవితానికి అన్వయించి వివరించడంలో రచయిత ప్రతిభ, సునిశిత పరిశీలన కనిపిస్తుంది. బౌద్ధం పట్ల ఆసక్తి, అనురక్తి ఉన్నవారందరూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాలివి.

ధర్మతేజం, ధర్మదీపం, ధర్మవీణ

రచయిత: బొర్రా గోవర్ధన్‌

ప్రచురణ: లతా రాజా పౌండేషన్‌

ప్రతులకు: 9390600157

ఇవి కూడా చదవండి

ఏడేళ్ల తర్వాత చైనాకు మోదీ.. ఇక అమెరికాకు మామూలుగా ఉండదు..

రీల్ కోసం సాహసం.. కదులుతున్న రైలుకు వెలాడుతూ వీడియో తీస్తుంటే.. షాక్..

Updated Date - Aug 29 , 2025 | 01:14 AM