Share News

ఎస్ఎస్ సీ కంబైన్డ్‌ హయ్యర్‌ సెకెండరీ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ నోటిఫికేషన్‌

ABN , Publish Date - Jun 30 , 2025 | 02:54 AM

స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎస్ఎస్ సీ) కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు...

ఎస్ఎస్ సీ కంబైన్డ్‌ హయ్యర్‌ సెకెండరీ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ నోటిఫికేషన్‌

గ్రాడ్యుయేట్‌ లెవెల్‌: స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎస్ఎస్ సీ) కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లోని 14,582 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత: గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. కొన్ని పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్‌లో మేథ్స్‌ పాసై ఉండాలి.

వయస్సు: 2025 ఆగస్ట్‌ 1వ తేదీ నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

చివరి తేదీ: 2025 జూలై 4

ఎంపిక విధానం:

  • టైర్‌-1 సీబీటీ ఆబ్జెక్టీవ్‌ పరీక్ష

  • టైర్‌-2 సీబీటీ - ఆబ్జెక్టివ్‌ పరీక్ష + స్కిల్‌ టెస్టులు

  • డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌

వెబ్‌సైట్‌: https://ssc.gov.in/


కంబైన్డ్‌ హయ్యర్‌ సెకెండరీ: స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎ్‌ససీ) కంబైన్డ్‌ హయ్యర్‌ సెకెండరీ లెవెల్‌ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంటర్‌ పూర్తిచేసిన వారు దీనికి దరఖాస్త చేసుకోవచ్చు. మొత్తం 3131 ఖాళీలు ఉన్నాయి

  • లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌

  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈవో)

  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌(గ్రేడ్‌-ఏ)

అర్హత: ఇంటర్మీడియేట్‌ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులూ అర్హులు. కొన్ని పోస్టులకు మాత్రం ఇంటర్‌లో మేథ్స్‌ పాసై ఉండాలి.

వయస్సు: 2026 జనవరి 1వ తేదీ నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే 1999 జనవరి 1 నుంచి 2008 జనవరి 1వ తేదీన జన్మించి ఉండాలి. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 15 సంవత్సరాల గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

చివరి తేదీ: 2025 జూలై 18

వెబ్‌సైట్‌: https://ssc.gov.in/

Also Read:

యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..

నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...

For More Telugu News

Updated Date - Jun 30 , 2025 | 02:54 AM