Health Benefits: వీటిని ఇలా తినాలి
ABN , Publish Date - May 20 , 2025 | 04:24 AM
కొన్ని పోషకాలు, ఇతర పోషకాలతో కలిసినప్పుడే శరీరానికి మెరుగైన లాభాలు ఇస్తాయి. ఈ కలయికలు శోషణను మెరుగుపరిచి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
కొన్ని పదార్థాల్లోని పోషకాలు ఇంకొక పదార్థంలోని ఇతర పోషకాలతో జత కలిసినప్పుడే ప్రభావవంతమైన ఫలితాన్నిస్తాయి. అవేంటో తెలుసుకుందాం!
పుచ్చ ముక్కల మీద కొద్దిగా ఉప్పు చల్లుకుని తింటే, పుచ్చలోని పొటాషియం ఉప్పులోని సోడియంతో జతకట్టి మనలోని ఎలకొ్ట్రలైట్స్ సంతులనానికి సహాయపడుతుంది
బాదం పప్పును, చాక్లెట్‌తో కలిపి తింటే బాదంలోని విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు డార్క్ చాక్లెట్‌లోని ఫ్లేవనాయిడ్స్‌తో కలిసి, యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ పెరిగి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది
ఓట్స్‌ను పెరుగులో నానబెడితే, ఓట్స్‌లోని ప్రిబయాటిక్ బీటా గ్లూకాన్ పెరుగులోని ప్రొబయాటిక్స్‌తో కలిసి పేగుల్లోని మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది, పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది
బ్రొకొలిని ఆవాలతో కలిపి తీసుకుంటే, ఆవాలలోని ఎంజైమ్స్, బ్రొకొలిలోని సల్ఫొరఫైన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ శోషణకు తోడ్పడతాయి
గ్రీన్ టీలో నిమ్మరసం కలుపుకుని తాగాలి. నిమ్మరసంలోని విటమిన్ సి, గ్రీన్‌టీలోని యాంటీఆక్సిడెంట్లను శరీరం మెరుగ్గా శోషించుకోడానికి తోడ్పడుతుంది
ఇవీ చదవండి:
Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి