Share News

నైట్‌ షిఫ్టులు చేస్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ABN , Publish Date - Jun 30 , 2025 | 03:55 AM

మారిన పరిస్థితుల దృష్ట్యా నేడు నైట్‌ షిప్టులు సాధారణమైపోయాయి. ఈ షిఫ్టుల వలన డిప్రెషన్‌, మధుమేహం, ఊబకాయంతో పాటు గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువని తెలిసిన్పటికీ చేయక...

నైట్‌ షిఫ్టులు చేస్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

మారిన పరిస్థితుల దృష్ట్యా నేడు నైట్‌ షిప్టులు సాధారణమైపోయాయి. ఈ షిఫ్టుల వలన డిప్రెషన్‌, మధుమేహం, ఊబకాయంతో పాటు గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువని తెలిసిన్పటికీ చేయక తప్పని పరిస్థితులు. కాబట్టి రాత్రి వేళల్లో పనిచేసే వారు ఆరోగ్యం కోసం పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సంగతులెంటో తెలుసుకుందాం..

నిద్ర తప్పనిసరి: రాత్రంతా పనిచేసి పగటి పూట పడుకున్నా ఎలాంటి అవాంతరాలు లేకుండా 7-8 గంటలు తప్పకుండా నిద్రపోవాలి. కాబట్టి పడుకునేపటప్పుడు గదిలోకి ఎలాంటి శబ్దాలు, వెలుతురు చొరబడకుండా జాగ్రత్త తీసుకోండి.

బయటి ఫుడ్‌ వద్దు: నైట్‌ షిప్టుల కారణంగా నీరసం, నిస్సవత్తువ ఉండడం సహజం. దాంతో ఇంట్లో వంట పని, ఇంటి పని చేసుకోలేక చాలా మంది బయటి ఆహారం తినేస్తుంటారు. కానీ అలా చేస్తే మరిన్ని ఆరోగ్య సమస్యలు దరిచేరతాయి. అందుకే ఇంటి భోజనం తినడానికే ప్రాధాన్యమివ్వాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.

టీ, కాఫీ వద్దు: నైట్‌ షిప్టుల్లో నిద్ర రాకుండా చాలామంది టీ, కాఫీలు ఎక్కువగా తాగేస్తుంటారు. కానీ వీటిలోని చక్కెర వలన మధుమేహం బారిన పడతారు. అందుకే ఇష్టారీతిన ఎప్పుడు పడితే అప్పుడు టీ, కాఫీలు తాగేయకూడదు.

వ్యాయాయం: శరీర దారుఢ్యం కోసం వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. కాబట్టి రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. అలాగే యోగా చేయడం వలన మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Also Read:

యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..

నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...

For More Telugu News

Updated Date - Jun 30 , 2025 | 03:55 AM