Share News

Home Remedies: ఈగలను తరిమికొట్టండి ఇలా...

ABN , Publish Date - Feb 20 , 2025 | 04:43 AM

వాతావరణం వేడెక్కే కొద్దీ ఈగల బెడద ఎక్కువవుతూ ఉంటుంది. ఈగలను తరిమికొట్టేందుకు కొన్ని చిట్కాలు...

Home Remedies: ఈగలను తరిమికొట్టండి ఇలా...

ఇంటి తలుపులు, కిటికీలు తెరచి ఉంచాలి. ఒక వెడల్పాటి గిన్నె లేదా మట్టి ప్రమిదను తీసుకుని అందులో అయిదు బిర్యానీ ఆకులు, రెండు చెంచాల వేప లేదా ఆవ నూనె, అయిదు కర్పూరం బిళ్లలు వేసి వెలిగించాలి. ఈ ప్రమిదని ప్రతి గదిలో కొంచెంసేపు ఉంచాలి. ఇందులో నుంచి వచ్చే పొగ వాసనకు ఈగలన్నీ బయటికిపోతాయి.

వంటగది సింక్‌ లోపల, చెత్తబుట్ట చుట్టూ బేకింగ్‌ సోడా చల్లి దానిపై నిమ్మ రసాన్ని చుక్కలుగా పిండాలి. నిమ్మకాయ వాసనవల్ల ఈగలు దూరంగా వెళ్లిపోతాయి.

ఒక పళ్లెంలో అయిదు మిరియాలు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా నూరాలి. ఈ పేస్టుని ఒక స్ర్పే బాటిల్‌లో వేసి నిండుగా నీళ్లు పోయాలి. వంటగది కిటికీల దగ్గర, తలుపుల మీద, సింక్‌లో ఈ నీళ్లు పిచికారీ చేస్తే ఈగలు రావు.

ఒక స్ర్పే బాటిల్‌లో ఉప్పు లేదా కర్పూరం పొడి కలిపిన నీళ్లు పోసి ఈగలు వాలే చోట పిచికారీ చేయాలి. ఈ నీళ్లతో ఇల్లంతా తుడిచినా మంచి ఫలితం కనిపిస్తుంది.


ఇవి కూడా చదవండి:

Anti Corruption: అవినీతిని అరికట్టేందుకు కీలక చర్యలు.. 52 మంది అధికారుల సస్పెండ్

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 20 , 2025 | 04:43 AM