Soft Chapati Tips: చపాతీలు చక్కగా
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:36 AM
చపాతీలు గుండ్రంగా, మెత్తగా, రుచికరంగా ఉండాలంటే పిండిని సరైన పద్ధతిలో ముద్దలా కలపాలి. దానితోపాటు తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలు ఇవే...
చపాతీలు గుండ్రంగా, మెత్తగా, రుచికరంగా ఉండాలంటే పిండిని సరైన పద్ధతిలో ముద్దలా కలపాలి. దానితోపాటు తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలు ఇవే...
వెడల్పాటి గిన్నెలో గోధుమపిండిని తీసుకుని తగినంత ఉప్పువేసి బాగా కలపాలి. కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండిని కలపాలి. పిండి మరీ గట్టిగా లేదా మరీ పలుచగా కాకుండా మెత్తగా ఉండేలా కలపాలి. వేళ్లతో పిండిని నొక్కుతూ ముద్దలా చేయాలి. పిండిలో చెంచా నూనె లేదా నెయ్యి వేసి కలిపితే మెత్తగా వస్తాయి.
పిండిని ముద్దలా కలిపి, దానిమీద కనీసం పావుగంటసేపు తడిగుడ్డ కప్పి ఉంచాలి. దీనివల్ల పిండి బాగా నాని మృదువుగా మారుతుంది. చపాతీలు పగుళ్లు లేకుండా గుండ్రంగా వస్తాయి.
స్టవ్ మీద పెనం పెట్టిన తరువాత మంట మధ్యస్థాయిలో ఉండాలి. పెనం మీద నూనె, నెయ్యి రాయకూడదు. పెనం బాగా వేడెక్కిన తరువాతనే దానిమీద చపాతీని వేయాలి. వెంటనే చపాతీ అక్కడక్కడా చిన్నగా పొంగుతూ కనిపించాలి. లేదంటే కాలడానికి ఎక్కువ సమయం పట్టడమేకాదు అది గట్టిపడిపోతుంది కూడా.
చపాతీని ఎక్కువసేపు కాల్చకూడదు. చివరగా దానిమీద కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి పళ్లెంలోకి తీయాలి. వెంటనే మూత పెడితే, చాలాసేపటి వరకు మెత్తగా ఉంటాయి.
Also Read:
జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి
ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?
For More Latest News