Share News

Bathroom Tips: బాత్‌రూమ్‌ సువాసనభరితంగా

ABN , Publish Date - Sep 01 , 2025 | 02:09 AM

మనం ఇంట్లో బాత్‌రూమ్‌ను పరిశుభ్రంగా ఉంచుకుంటాం. అయినప్పటికీ ఒక్కోసారి దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో బాత్‌రూమ్‌ను సువాసనభరితంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం...

Bathroom Tips: బాత్‌రూమ్‌ సువాసనభరితంగా

మనం ఇంట్లో బాత్‌రూమ్‌ను పరిశుభ్రంగా ఉంచుకుంటాం. అయినప్పటికీ ఒక్కోసారి దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో బాత్‌రూమ్‌ను సువాసనభరితంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం...

  • ఒక చిన్న గిన్నెలో రెండు చెంచాల బేకింగ్‌ సోడా వేసి దాన్ని బాత్‌రూమ్‌లో ఒక మూలగా లేదా కిటికీలో ఓ పక్కగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల బేకింగ్‌ సోడా దుర్వాసనను పీల్చుకుని బాత్‌రూమ్‌లో తాజాదనాన్ని నింపుతుంది.

  • వాడేసిన నిమ్మతొక్కలు అలాగే నారింజ, బత్తాయి, అనాస తొక్కలను చిన్న ముక్కలుగా చేసి ఒక గిన్నెలో వేయాలి. ఈ గిన్నెను బాత్‌రూమ్‌లోని ఓ అరలో పెడితే మంచి ప్రయోజనం ఉంటుంది.

  • తేమ వాతావరణంలో బాగా పెరిగే ఇండోర్‌ ప్లాంట్‌ కుండీని బాత్‌రూమ్‌లో ఏర్పాటు చేసుకున్నా తాజా అనుభూతి కలుగుతుంది.

  • ఒక బకెట్‌ నీళ్లలో నాలుగు చెంచాల వెనిగర్‌ వేసి బాగా కలపాలి. ఈ నీళ్లతో శుభ్రం చేస్తే బాత్‌రూమ్‌లో దుర్వాసన రాదు. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

  • బాత్‌రూమ్‌లో వెంటిలేషన్‌ సరిగా ఉండేలా చూసుకోవాలి. గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరిస్తే తేమ నిలవదు. దీనివల్ల బాత్‌రూమ్‌ ఎప్పుడూ పొడిగా తాజాగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

హరీష్ రావు తప్పు చేశారని కమిషన్ చెప్పింది: ముఖ్యమంత్రి రేవంత్

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోంది.. మంత్రి ఉత్తమ్‌‌పై హరీష్‌రావు ఫైర్

Updated Date - Sep 01 , 2025 | 02:09 AM