Home Remedies for Glowing Skin: మెరిసే చర్మం కోసం
ABN , Publish Date - Aug 31 , 2025 | 02:35 AM
పోషకాహార లోపం, హార్మోన్ల అసమతౌల్యం, నెలసరి సమస్యల కారణంగా ఒక్కోసారి ముఖం మీద మొటిమలు, గుల్లలు, గడ్డలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటివల్ల మచ్చలు కూడా ఏర్పడుతుంటాయి. కొన్ని...
పోషకాహార లోపం, హార్మోన్ల అసమతౌల్యం, నెలసరి సమస్యల కారణంగా ఒక్కోసారి ముఖం మీద మొటిమలు, గుల్లలు, గడ్డలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటివల్ల మచ్చలు కూడా ఏర్పడుతుంటాయి. కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తూ వీటినుంచి ఉపశమనం పొందవచ్చు.
ఒక ఐస్ క్యూబ్‌ను పలుచని గుడ్డలో చుట్టి మొటిమలు, గడ్డలపై మెల్లగా అద్దాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే క్రమంగా మొటిమలు తగ్గుతాయి.
ఒక గిన్నెలో రెండు చెంచాల శనగపిండి, ఒక చెంచా పసుపు, తగినన్ని గులాబీ నీళ్లు పోసి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి
పట్టించి పావు గంటసేపు ఆరనివ్వాలి. తరవాత వేళ్ల కొనలతో ముఖం మీద గుండ్రంగా రుద్దుతూ పిండిని తొలగించాలి. వెంటనే గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం మీద ఉన్న మృతకణాలు తొలగి, మొటిమలు, మచ్చలుతగ్గి ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
ఒక గిన్నెలో రెండు చెంచాల గంధం పొడి లేదా ముల్తాని మట్టి వేసి తగినన్ని నీళ్లు పోసి కలపాలి. ఈ పేస్టుని ముఖానికి పట్టించాలి. పావుగంటసేపు ఆరనిచ్చి చల్లని నీళ్లతో శుభ్రం చేసుకుంటే ముఖం మీద పేరుకున్న జిడ్డు తొలగిపోతుంది. మొటిమలు కూడా తగ్గుతాయి.
బాగా పండిన టమాటాను మధ్యకు కోసి ఆ బద్దతో ముఖాన్ని కింది నుంచి పైకి మృదువుగా మర్ధన చేయాలి. ఇలా పది నిమిషాలపాటు చేసిన తరవాత చల్లని నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోవాలి. రెండు రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉంటే ముఖం మీద మచ్చలన్నీ మాయమవుతాయి.
ఇవి కూడా చదవండి
హీరో అసభ్య ప్రవర్తన.. హీరోయిన్‌పై ట్రోలింగ్స్..
జైల్లో స్టార్ హీరో అష్టకష్టాలు.. బెడ్ షీట్ కావాలంటూ వేడుకోలు..