స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ABN , Publish Date - May 12 , 2025 | 06:37 AM
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2964 ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సర్కిల్ 233 ఖాళీలు...
సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఖాళీలు : 2964
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2964 ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సర్కిల్ 233 ఖాళీలు, అమరావతి సర్కిల్‌లో 186 ఖాళీలు ఉన్నాయి.
ఖాళీలు: 2600 + బ్యాక్‌లాగ్ పోస్టులు 364 మొత్తం 2964
సర్కిల్స్: హైదరాబాద్ సర్కిల్ 233, అమరావతి సర్కిల్ 186
అర్హత: గ్రాడ్యుయేషన్, ఏదైనా బ్యాంకులో 2 సంవత్సరాల ఉద్యోగ అనుభవం ఉండాలి
వయస్సు: 2025 ఏప్రిల్ 30 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి(1995 మే 1 -2004 ఏప్రిల్ 30 తేదీల మధ్యలో జన్మించి ఉండాలి). ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీలను మూడేళ్లు, పీడబ్ల్యూడీ వారికి పది సంవత్సరాలు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, స్ర్కీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, స్థానిక భాష పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష: ఆబ్జెక్టివ్ విధానంలో 120 మార్కులకు ఉంటుంది. దీనిని రెండు గంటల్లో పూర్తి చేయాలి. ఈ పరీక్షలో నాలుగు భాగాలు ఉంటాయి. ఇంగ్లిష్ భాషా 30 ప్రశ్నలు(30 మార్కులు), బ్యాంకింగ్ నాలెడ్జ్ 40 ప్రశ్నలు(40 మార్కులు), జనరల్ అవేర్‌నెస్/ ఎకానమీ 30 ప్రశ్నలు(30 మార్కులు), కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు(20 మార్కులు) ఉంటాయి.
టెస్ట్: ఇది 50 మార్కులకు ఉంటుంది.
30 నిమిషాల్లో పూర్తి చేయాలి. లెటర్ రైటింగ్,
ఎస్సే ఇంగ్లిష్‌లో రాయాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: 2025 మే 29
ఆన్‌లైన్ పరీక్ష: 2025 జూలై
వెబ్‌సైట్: https://sbi.co.in/
Read Also: Ranveer Allahbadia: ఆపరేషన్ సిందూర్.. అనవసర పోస్టు పెట్టి చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్లాహ్‌బాదియా
Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం.. భారత సైన్యం
Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్