Share News

SBI recruitment 2025: ఎస్‌బీఐలో జూనియర్‌ అసిస్టెంట్లు

ABN , Publish Date - Aug 11 , 2025 | 01:54 AM

జూనియర్‌ అసోసియేట్స్‌(కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను కోరుతోంది. దేశ వ్యాప్తంగా మొత్తం 6589 పోస్టులు ఉన్నాయి...

SBI recruitment 2025: ఎస్‌బీఐలో జూనియర్‌ అసిస్టెంట్లు

ఖాళీలు 6589

జూనియర్‌ అసోసియేట్స్‌(కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను కోరుతోంది. దేశ వ్యాప్తంగా మొత్తం 6589 పోస్టులు ఉన్నాయి.

పోస్ట్‌పేరు: జూనియర్‌ అసోసియేట్స్‌(కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌)

అర్హతలు: గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. ఫైనలియర్‌ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 2025 డిసెంబర్‌ 31లోపు గ్రాడ్యుయేషన్‌ పరీక్ష పాసైనట్లు సర్టిఫికెట్‌ చూపించాలి.

వయస్సు: 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే 1997 ఏప్రిల్‌ 2నుంచి 2005 ఏప్రిల్‌ 1వ తేదీలోపు జన్మించి ఉండాలి. ఓబీసీలకు మూడు సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, దివ్యాంగులకు కేటగిరీలను అనుసరించి 10 నుంచి 15 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది. మాజీ సైనికులకు, ఇతరులకు నిబంధలను అనుసరించి సడలింపు ఉంటుంది.

భాషా ప్రావీణ్యం: దరఖాస్తు చేస్తున్న రాష్ట్రానికి సంబంధించిన భాష రాయడం, చదవడం వచ్చి ఉండాలి. పది, ఇంటర్‌లో ఆ భాష చదివినట్లు సర్టిఫికెట్‌ చూపించాల్సి ఉంటుంది.

చివరి తేదీ: 2025 ఆగస్ట్‌ 26

వెబ్‌సైట్‌: sbi.co.in/

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!

ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

For More Telangana News And Telugu News

Updated Date - Aug 11 , 2025 | 01:54 AM