Grapes: ద్రాక్షపండ్లను ఇలా తినాలి...
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:26 AM
బజారు నుంచి ద్రాక్షపండ్లు తెచ్చాక వాటిని సరైన పద్దతిలో కడిగిన తరవాతనే తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటిపై ఉండే పురుగుమందుల అవశేషాల వల్ల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

ముందుగా ద్రాక్షపండ్లను గుత్తినుంచి వేరు చేయాలి. మెత్తగా ఉండి చెడిపోయినవాటిని, సగానికి కోసుకుపోయినవాటిని ఏరివేయాలి.
వెడల్పాటి గిన్నెలో సగానికిపైగా గోరువెచ్చని నీళ్లు పోయాలి. ఇందులో రెండు చెంచాల ఉప్పు, ఒక చెంచా పసుపు, ఒక చెంచా వంటసోడా వేసి బాగా కలపాలి. తరవాత ద్రాక్షపండ్లు వేసి మెల్లగా రుద్దుతూ కడగాలి. రెండు నిమిషాలు అలాగే ఉంచాలి. తరవాత ఈ నీళ్లు తీసివేసి మంచినీళ్లు పోసి మరోసారి కడగాలి. పలుచని గుడ్డమీద ద్రాక్షపండ్లు వేసి తడి ఆరనివ్వాలి. తరవాత ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుకోవచ్చు.
పెద్ద గిన్నెలో సగం వరకు నీళ్లు పోసి మూడు చెంచాల వెనిగర్ వేసి బాగా కలపాలి. ఇందులో ద్రాక్షపండ్లు వేసి రెండు నిమిషాలు ఉంచాలి. తరవాత వీటిని మంచినీళ్లతో మరోసారి కడిగి ఆరబెట్టాలి.
ఇలా శుభ్రం చేసిన తరవాతనే ద్రాక్షపండ్లను పిల్లలకు, పెద్దలకు తినిపించాలి.
ఇవి కూడా చదవండి..
Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..
Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్‌బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు
Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.