Saree Styling Tips: కనికట్టు చేసే కాంత
ABN , Publish Date - Jul 23 , 2025 | 02:26 AM
ఎప్పటికప్పుడు సరికొత్త చీరలు పుట్టుకొస్తూనే ఉంటాయి, మహిళల మనసులను దోచుకుంటూనే ఉంటాయి. అలాంటివే ‘కాంత’ చీరలు. దారపు కుట్టుతో కనికట్టు చేస్తున్న ఈ చీరల మీద...
ఫ్యాషన్
ఎప్పటికప్పుడు సరికొత్త చీరలు పుట్టుకొస్తూనే ఉంటాయి, మహిళల మనసులను దోచుకుంటూనే ఉంటాయి. అలాంటివే ‘కాంత’ చీరలు. దారపు కుట్టుతో కనికట్టు చేస్తున్న ఈ చీరల మీద ఓ లుక్కేద్దాం!
కాంత అనే బెంగాలీ పదానికి... ‘పాత వస్త్రం’ అని అర్థం. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లోని మహిళలు కొన్ని వందల ఏళ్లుగా వాడేసిన పాత చీరలతో కాంత క్విల్ట్‌లు, పరుపు, దిండ్ల కవర్లు, అలంకరణ వస్త్రాలు తయారుచేస్తున్నారు. ఈ ఎంబ్రాయిడరీల్లో సరళమైన పూల మోటిఫ్స్ మొదలు అతి పెద్ద సన్నివేశాల వరకూ ఉంటాయి. అయితే వెనకున్న వస్త్రపు రంగుతో సరిపోలేలా, క్విల్టింగ్ తరహా కుట్టు వేయడం ఈ కాంత పనితనం ప్రత్యేకత. ఇదే పనితనంతో తయారవుతున్న కాంత చీరలు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయి. వాటినెలా సింగారించాలో తెలుసుకుందాం!
కాటన్, సిల్క్, మస్లిన్ వస్త్రాల కాంత చీరలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సిల్క్, మస్లిన్ కాంత చీరలు వేడుకలకు ఎంతో బాగా నప్పుతాయి. కాటన్ కాంత చీరలు డైలీవేర్‌గా బాగుంటాయి.
ఈ చీరలు ఒకింత చికన్‌కారీ పనితనాన్ని తలపించేలా ఉంటాయి. కానీ కాంతలో జానపద కథలు, రోజువారీ జీవనవిధానాలు ఎంబ్రాయిడరీ రూపంలో ఆకట్టుకుంటూ ఉంటే, చికన్‌కారీలో కేవలం పువ్వులు, లతలే మనకు కనిపిస్తాయి. కాబట్టి రొటీన్‌కు భిన్నంగా కనిపించాలనుకుంటే కాంత చీరలే ఎంచుకోవాలి.
టెర్రకోట ఆభరణాలు, జర్మన్ సిల్వర్ ఆభరణాలు కాంత చీరలకు ఎంతో బాగా సూటవుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి