కాలేయ కొవ్వు తిరుగుముఖం
ABN , Publish Date - Jun 24 , 2025 | 05:33 AM
కాలేయ కొవ్వు సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. ప్రత్యేకించి విశ్రాంత స్థితిలో ఎక్కువ సమయాలు గడపడం, ప్రాసెస్ చేసిన పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్య అంతకంతకూ...
తెలుసుకుందాం
కాలేయ కొవ్వు సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. ప్రత్యేకించి విశ్రాంత స్థితిలో ఎక్కువ సమయాలు గడపడం, ప్రాసెస్ చేసిన పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్య అంతకంతకూ తీవ్రమవుతోంది. అయితే ఈ పరిస్థితిని కొన్ని ఆహారపదార్థాలతో తిరుగుముఖం పట్టించవచ్చని అంటున్నారు వైద్యులు.
కాలేయ కొవ్వును తగ్గించే 4 నిర్దిష్ట ఆహార సమ్మేళనాలను సూచిస్తున్నారు హార్వర్డ్‌లో శిక్షణ పొందిన కాలేయం, పేగుల నిపుణులు, డాక్టర్ సౌరభ్ సేథి. కాలేయ కొవ్వు కరుగుదల, ఇన్‌ఫ్లమేషన్, పేగుల ఆరోగ్యాల మీద ప్రభావం కనబరిచే వీటిని ఎంతో జాగ్రత్తగా ఎంచుకున్నారు. అవేంటంటే....
ఖర్జూరం, వాల్‌నట్స్: ఖర్జూరాలు తీయగా ఉంటాయని మాత్రమే మనందరికీ తెలుసు. కానీ వాటిలో నీటిలో కరిగే పీచు పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణప్రక్రియను, చక్కెర శోషణలను నెమ్మదించి, కాలేయంలో పేరుకున్న కొవ్వు కరిగేలా చేస్తుంది. ఖర్జూరాన్ని వాల్‌నట్స్‌తో జోడించి తినడం వల్ల, ఈ ప్రభావం రెట్టింపు అవుతుంది. ఒమేగా3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉండే వాల్‌నట్స్, కాలేయ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, ఇంజైమ్ మోతాదులను మెరుగు పరుస్తాయని అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల, తీపి తినాలనే కోరిక తీరడంతో పాటు కాలేయ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.
డార్క్ చాక్లెట్, నట్స్: మంచి నాణ్యత కలిగిన డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలోని కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. డార్క్ చాక్లెట్‌కు బాదం, పిస్తాల్లాంటి నట్స్‌ను జోడించగలిగితే లాభాలు రెట్టింపవుతాయి. నట్స్‌లోని విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు కాలేయ కణాలను కాపాడతాయి.
ఇవి కూడా చదవండి..
అనుకున్న లక్ష్యాలను సాధించిన ఆపరేషన్ సిందూర్
సీఎం సారూ.. స్కూలు సీటు కావాలి
For National News And Telugu News