మూడు పదులు నిండితే...
ABN , Publish Date - May 07 , 2025 | 12:43 AM
వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం, కండరాలు, శిరోజాలు బలహీనమవుతూ ఉంటాయి. ప్రతిరోజూ యోగా, వ్యాయామం చేస్తూ మంచి పోషకాహారం తీసుకుంటూ ఉంటే ముప్పై ఏళ్లు నిండినా కూడా...
వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం, కండరాలు, శిరోజాలు బలహీనమవుతూ ఉంటాయి. ప్రతిరోజూ యోగా, వ్యాయామం చేస్తూ మంచి పోషకాహారం తీసుకుంటూ ఉంటే ముప్పై ఏళ్లు నిండినా కూడా అందంగా ఆరోగ్యంగా ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. ఇలా ఆరోగ్యాన్ని అందిస్తూ అందాన్ని పెంచే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం...
ప్రతిరోజు ఒక కప్పు బొప్పాయి ముక్కలు తినడం అలవాటు చేసుకోవాలి. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మం పొడిబారకుండా, ముడుతలు రాకుండా చేస్తాయి. రక్తాన్ని శుద్ది చేస్తాయి. జీర్ణక్రియ సజావుగా జరిగేలా తోడ్పడతాయి.
వారానికి రెండు రోజులు పాలకూరని ఆహారంలో చేర్చుకోవాలి. పాలకూరలో ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరుని చురుకుగా మారుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. శిరోజాలకు ఆరోగ్యాన్ని అందిస్తాయి.
తరచూ అవకాడో తినడం మంచిది. దీనిలో ఇ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంతోపాటు అకాల వార్థక్యాన్ని నివారిస్తుంది.
ప్రతిరోజూ సాయంత్రంపూట బాదం, పిస్తా, జీడిపప్పు, మొలకలు, గుమ్మడి గింజలు లాంటివి తీసుకుంటూ ఉండాలి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, జింక్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఏర్పడే ఇన్‌ఫ్లమేషన్ సమస్యలను నివారిస్తాయి.
తరచూ గ్రీన్ టీ తాగుతూ ఉంటే శరీరంలో పేరుకునే విషపదార్థాలు విసర్జితమవుతాయి. మెదడు, గుండె ఆరోగ్యంగా పనిచేస్తాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. పొట్ట పెరగకుండా ఉంటుంది.
ప్రతిరోజూ కనీసం ఒక కప్పు పెరుగు తీసుకోవడం మంచిది. దీనిలోని బ్యాక్టీరియా జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు బలోపేతమవుతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గి మంచి నిద్ర పడుతుంది.
తరచూ డార్క్ చాక్లెట్ తింటూ ఉంటే మెదడు ఉత్తేజితమవుతుంది. నీరసం, అలసట తగ్గుతాయి.
ఇవి కూడా చదవండి..
సరిహద్దు వెంబడి భారీ వైమానిక ఎక్సర్‌సైజ్.. నోటీసు విడుదల చేసిన కేంద్రం
India Pak War: యుద్ధం పరిష్కారం కానేకాదు.. భారత్‌కు ఐరాసా సూచన
Pakistan Army Chief: భారత్ దాడికి దిగితే.. పాక్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
మరిిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి