Share News

ప్రసవం మునుపటి పటుత్వం కోసం

ABN , Publish Date - Jun 24 , 2025 | 05:53 AM

మధురమైనదే! అయితే పొట్ట మీద చారలు, కటి కండరాలు పటుత్వం కోల్పోవడం లాంటి ప్రసవానంతర క్రియాత్మక మార్పులు తల్లులను మాతృత్వ మధురిమలకు దూరం చేస్తాయి. తల్లులను ఆత్మన్యూనతకు లోను చేసే...

ప్రసవం మునుపటి పటుత్వం కోసం

అమ్మల ఆరోగ్యం

మాతృత్వం కచ్చితంగా

మధురమైనదే! అయితే పొట్ట మీద చారలు, కటి కండరాలు పటుత్వం కోల్పోవడం లాంటి ప్రసవానంతర క్రియాత్మక మార్పులు తల్లులను మాతృత్వ మధురిమలకు దూరం చేస్తాయి. తల్లులను ఆత్మన్యూనతకు లోను చేసే ఈ అసౌకర్యాలను కొత్త చికిత్సలతో సరిదిద్దుకునే వీలుందని అంటున్నారు వైద్యులు.

సాధారణంగా గర్భధారణతో విడుదలయ్యే హార్మోన్ల వల్ల శరీరంలోని ప్రతి కణం ప్రభావితమవుతుంది. హార్మోన్లలో చోటుచేసుకునే మార్పులతో పాటు పెరిగే బిడ్డకు సరిపడా జాగాను సమకూర్చడం కోసమే మన కణాలు మార్పులకు లోనవుతాయి. అలాగే ప్రసవ సమయంలో కండరాలు వాటి పూర్తి సామర్థ్యం మేరకు సాగుతాయి. కానీ ప్రసవం తర్వాత పొత్తికడుపు, కటి ప్రదేశంలోని కండరాలు అంతే సమానంగా సంకోచించలేవు. దాంతో ప్రసవానంతరం మహిళ శరీరం మునుపటి పటుత్వాన్ని పూర్తిగా తిరిగి పొందలేకపోతుంది. అయినప్పటికీ ప్రసవంతో చోటుచేసుకున్న ఈ భౌతిక మార్పులతో పాటు కొన్ని క్రియాత్మక మార్పులను కూడా సరిదిద్దగలిగే వీలుంది. ప్రసవానంతర వ్యాయామాలతో కండరాల పటుత్వాన్ని కొంత మేరకు పెంచుకోవచ్చు. అవి సత్ఫలితాన్నివ్వని సందర్భాల్లో, కొత్తగా తలెత్తే అసౌకర్యాలకు అడ్డుకట్ట వేయడం కోసం, అందుబాటులో ఉన్న చికిత్సలను ఆశ్రయించాలి.


3-navya.jpg

కొత్త చికిత్సలతో...

పిల్లలను కన్న తల్లులు సమతులాహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేయగలిగితే కొంత మేరకు కటి కండరాలు పటుత్వాన్ని పొందుతాయి. ఈ జాగ్రత్తలు పాటించినా పరిస్థితి మెరుగుపడని సందర్భాల్లో, క్లిష్టమైన ప్రసవాల మూలంగా వ్యాయామాలు చేయలేని సందర్భాల్లో సదరు మహిళలు ఆశ్రయించదగిన చికిత్సలు కొన్ని అందుబాటులో ఉన్నాయి. సాధారణ ప్రసవం లేదా సిజేరియన్‌తో పిల్లలను కన్న తల్లులు, పిల్లలను కన్న ఆరు నుంచి ఎనిమిది వారాలకు ఈ చికిత్సలను ఆశ్రయించవచ్చు.

హైఫెమ్‌ ఛెయిర్‌: విద్యుత్తుతో పని చేసే ఈ ఛెయిర్‌లో అరగంట పాటు కూర్చున్నప్పుడు 11 వేల కండరాలు సంకోచానికి గురవుతాయి. కండరాలు ప్రేరేపితమై, కొల్లాజెన్‌ ఉత్పత్తి ఊపందుకుంటుంది. దాంతో కండరాలు పటుత్వాన్ని సంతరించుకుంటాయి. ఈ చికిత్సను ఆరు విడతలుగా వారానికి రెండుసార్లు చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది.

లేజర్‌ చికిత్స: సాధారణ ప్రసవంతో యోని వదులుగా మారినప్పుడు, బిగుతును పెంచడం కోసం ఈ చికిత్స ఉపయోగపడుతుంది. ఈ ఐదు నిమిషాల చికిత్స కోసం ఏ పనులూ ఆపుకోవలసిన అవసరం లేదు. ఉద్యోగినులు కూడా నిరభ్యంతరంగా ఈ చికిత్సను ఆశ్రయించవచ్చు. ఈ చికిత్సను నాలుగు విడతలుగా నెలకొకసారి చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది.

స్ట్రెచ్‌ మార్క్స్‌: కొందరికి పొట్ట మీద ఏర్పడే చారలు ప్రసవానంతరం క్రమేపీ తగ్గిపోతాయి. కొందరికి అలాగే ఉండిపోయి, ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి చారలను కూడా లేజర్‌ చికిత్సతో 90 శాతం మేరకు తగ్గించే వీలుంది. ఈ చికిత్సను నెలకొకసారి చొప్పున ఆరు విడతల్లో చేయించుకోవాలి.


ప్రయోజనాలున్నాయి

హైఫెమ్‌ ఛెయిర్‌, లేజర్‌ సర్జరీలతో పొందే ప్రయోజనాలు ఇవే!

ఇన్‌ఫెక్షన్లు: ప్రసవానంతర ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి

యోని పొడిబారడం: లేజర్‌ చికిత్సతో ఈ సమస్య తొలగిపోతుంది

లైంగిక తృప్తి: యోని వదులవడంతో తలెత్తే అసంతృప్తి సమస్యలు తొలగి

పోతాయి

123-sliders.jpg

40 ఏళ్ల మహిళల్లో...

ఈ వయసు మహిళల్లో మూత్రాశయ కండరాలు బలహీనపడడం వల్ల మూత్రం మీద పట్టు తగ్గుతుంది. తరచూ మూత్ర విసర్జన చేయవలసి రావడం, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం, దగ్గినా, తమ్మినా మూత్రం లీక్‌ అవుతూ ఉండడం లాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ కోవకు చెందిన మహిళలు కెగెల్‌ వ్యాయామాలు, లేజర్‌ చికిత్సలతో సమస్యను సరిదిద్దుకోవచ్చు. అలాగే మఽధుమేహులైన మహిళలు కూడా మూత్రాన్ని ఏమాత్రం ఆపుకోలేరు. వీళ్లు కూడా లేజర్‌ చికిత్సను ఆశ్రయించవచ్చు.

ఈ చికిత్సల తర్వాత వైద్యులు సూచించిన వ్యాయామాలు చేస్తూ, సమతులాహారం తీసుకున్నంత కాలం సమస్యలు అదుపులో ఉంటాయి. అలాగే ఏడాదికోసారి పరీక్షలు చేసుకుంటూ కండరాల పటుత్వాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. కండరాల క్రియత్మాక ప్రభావం తగ్గిన సందర్భాల్లో కొందరు మహిళలకు ఇవే చికిత్సలు మళ్లీ అవసరం పడొచ్చు.

ఇవి కూడా చదవండి..

అనుకున్న లక్ష్యాలను సాధించిన ఆపరేషన్ సిందూర్

సీఎం సారూ.. స్కూలు సీటు కావాలి

For National News And Telugu News


ప్రసవం తర్వాత శరీరం బరువు పెరుగుతుంది. రూపం కోల్పోతుంది. ‘ఇవన్నీ సహజసిద్ధ మార్పులే కాబట్టి వాటితో సర్దుకుపోవలసిందే!’ అనే ఆలోచనలు మహిళల మనసుల్లో నాటుకుపోయి ఉంటాయి. కానీ నిజానికి అలా సర్దుకుపోవలసిన అవసరం లేదు. ప్రసవం మునుపటి పటుత్వాన్ని పొందడం కోసం అందుబాటులో ఉన్న చికిత్సలను ఆశ్రయించడం అవసరం. వీటితో సౌందర్యపరంగా, క్రియాత్మకంగా పూర్వపు పటుత్వాన్ని సాధించి కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరగి పొందగలిగే వీలుంది.

డాక్టర్‌ డి.జయలక్ష్మి

కాస్మటిక్‌ గైనకాలజిస్ట్‌,

రోహన్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌.

ఇవి కూడా చదవండి..

అనుకున్న లక్ష్యాలను సాధించిన ఆపరేషన్ సిందూర్

సీఎం సారూ.. స్కూలు సీటు కావాలి

For National News And Telugu News

Updated Date - Jun 24 , 2025 | 05:53 AM