పనీర్ ప్రయోజనాలెన్నో
ABN , Publish Date - Jun 25 , 2025 | 04:45 AM
మనం తరచూ వంటల్లో ఉపయోగించే పనీర్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయం టున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం...
మనం తరచూ వంటల్లో ఉపయోగించే పనీర్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయం టున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం...
పనీర్‌లో అధిక మొత్తంలో ప్రొటీన్ ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రించి బరువు పెరగకుండా తోడ్పడుతుంది. కండర పుష్టికి కూడా సహాయపడుతుంది.
ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్‌లు దంతాలు, ఎముకలను బలంగా ఉంచడంలో తోడ్పడతాయి.
ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు రుమటాయిడ్, ఆర్థరైటిస్ వంటి ఎముక సంబంధిత సమస్యల బారి నుంచి కాపాడతాయి.
కొవ్వులు, ప్రోటీన్లు పనీర్‌లో సమృద్ధిగా ఉంటాయి. దాంతో త్వరగా అలసట దరిచేరదు.
పనీర్ జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి తోడ్పడుతుంది. దీనిలోని విటమిన్ బి 12 మెటబాలిజంను మెరుగుపరుస్తుంది.
పనీర్‌లోని అమైనో ఆమ్లాలు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తికి తోడ్పడతాయి. దాంతో రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి.
ఇవీ చదవండి:
హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్ తట్టుకోగలదా
మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి