Share News

Spinach benefits: బాల్కనీలో పాలకూర పెంచేద్దాం!

ABN , Publish Date - Jan 29 , 2025 | 01:17 AM

ప్రతిరోజూ పాలకూరను కొద్ది మోతాదులోనైనా ఆహారంలో చేర్చుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంటిల్లిపాదికీ ఆరోగ్యాన్ని అందించే పాలకూరను ఇంటి బాల్కనీలోని కుండీలో ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం!

Spinach benefits: బాల్కనీలో పాలకూర పెంచేద్దాం!

ఆకుకూరల్లో పాలకూర ఆరోగ్యవంతమైనది. దీనిలో బి, సి, ఇ, కె విటమిన్లతోపాటు కాల్షియం, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ అధికంగా ఉంటాయి. ప్రతిరోజూ పాలకూరను కొద్ది మోతాదులోనైనా ఆహారంలో చేర్చుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంటిల్లిపాదికీ ఆరోగ్యాన్ని అందించే పాలకూరను ఇంటి బాల్కనీలోని కుండీలో ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం!

లోతు ఎక్కువగా ఉన్న వెడల్పాటి కుండీలో మట్టి నింపాలి. దీనిలో సేంద్రీయ ఎరువు, ఎండిన ఆకులు కలపాలి. మట్టి అంతా తడిసేలా నీరు చిలకరించి పాలకూర విత్తనాలు చల్లాలి. మట్టికి ఎండ తగిలేలా ఉంచితే నాలుగు రోజుల్లో మొలకలు వస్తాయి.

మొక్క పెరుగుతున్నపుడు రెండు వారాలపాటు ప్రతిరోజూ అయిదు నుంచి ఆరు గంటలు ఎండ తగిలేలా చూసుకోవాలి. మొక్క పెరిగిన తరవాత కనీసం ఎనిమిది గంటలు సూర్యరశ్మి సోకాలి.

మొక్కకు తరచూ నీరు పెడుతూ ఉండాలి. మట్టి ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి. ఎండాకాలంలో మట్టి తడి ఆరిపోకుండా మొక్క చుట్టూ గడ్డిని లేదా ఆకులను పరచాలి.

నాలుగు వారాల తరవాత కుండీలోని మట్టికి నత్రజని అధికంగా ఉన్న ఎరువును కలిపితే ఆకులు పెద్దగా వస్తాయి.

కుండీని వేడిగా ఉండే ప్రదేశంలో ఉంచితే మొక్క బాగా పెరుగుతుంది.


మరిన్ని తెలుగు వార్తల కోసం..

Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం

Also Read: నీ ఇంట్లో నుంచి అవార్డు ఇస్తున్నావా సంజయ్..!

Also Read:ఆర్చర్ జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి

Also Read: అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు

Updated Date - Jan 29 , 2025 | 01:34 AM