OTT: ఈ వారమే విడుదల
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:21 AM
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

డబ్బాలో డ్రగ్స్
డబ్బా డెలివరీ వ్యాపారం ద్వారా డ్రగ్స్ సరఫరా చేయడం ప్రారంభించిన ఐదుగురు సాధారణ మహిళల జీవితంలో జరిగిన సంఘటనలు ఇతివృత్తంగా రూపొందిన హిందీ సిరీస్ ‘డబ్బా కార్టెల్’. ముంబైలోని కొందరు గృహిణులు ముఠాగా ఏర్పడి డబ్బావాలాల ముసుగులో మత్తు పదార్థాలను సరపరా చేస్తుంటారు. ఈ విషయం తెలుసుకున్న డ్రగ్స్ మాఫియా ఆ మహి ళలను బెదిరించి వారిని డ్రగ్స్ సరఫరాకు ఉపయోగించుకుంటుంది.
ఆ క్రమంలో అటు మాఫియా, ఇటు పోలీసులతో ఆ ఐదుగురు మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వాటిని ఎలా అధిగమించారు అనే ఇతివృత్తంగా ఈ సిరీస్ సాగుతుంది. ఈ థ్రిల్లర్ సిరీ్‌సలో షబానా అజ్మీ, నిమిషా సజయన్, షాలినీ పాండే, అంజలి, జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించారు. హితేశ్ భాటియా దర్శకత్వం వహించారు.
ఇవి కూడా చదవండి..
Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..
Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్‌బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు
Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.