Share News

Pigeon: పావురాలు రాకుండా ఉండాలంటే...

ABN , Publish Date - Feb 20 , 2025 | 04:38 AM

బాల్కనీ, కిటికీలు, వెంటిలేటర్ల వద్ద పావురాలు వచ్చి గూళ్లు కడుతూ ఉంటాయి. వీటి రెట్టల వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. నెట్‌, మెష్‌ లాంటివి పెట్టకుండా ఇంట్లో దొరికేవాటితోనే కొన్ని చిట్కాలు పాటించి పావురాలు రాకుండా చేయవచ్చు.

Pigeon: పావురాలు రాకుండా ఉండాలంటే...

గుప్పెడు మిరియాలను తీసుకుని కొద్దిగా వేడి చేసి మెత్తగా నూరి పొడి చేయాలి. బాల్కనీ, కిటికీలతోపాటు పావురాలు వాలే ప్రదేశాల్లో ఈ పొడిని చల్లాలి. మిరియాల ఘాటుకి పావురాలు రావు.

ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా వెనిగర్‌ లేదా పుదీనా నూనె కలిపి పావురాలు తిరిగే చోట చల్లితే అవి వెళ్లిపోతాయి. ఏదైనా ఎస్సెన్షియల్‌ ఆయిల్‌ లేదా దాల్చిన చెక్క పొడి కలిపిన నీళ్లు చల్లినా ప్రయోజనం ఉంటుంది.

పావురాలు వాలే ప్రదేశాల్లో విండ్‌ చైమ్స్‌ వేలాడదీయాలి. గాలి వీచినప్పుడు ఇవి చేసే శబ్దం వల్ల పావురాలు దూరంగా వెళ్లిపోతాయి. అద్దాలతోపాటు మెరిసే గొట్టాలు ఉన్నవి అయితే మంచి ఫలితం కనిపిస్తుంది.

బాల్కనీలో గద్ద, గుడ్లగూబ లాంటి పెద్ద పక్షుల బొమ్మలను వేలాడదీస్తే పావురాలు భయపడి రావు.

సన్నని దారంతో పాత సీడీలను కట్టి వేలాడదీస్తే అవి ప్రతిబింబించే రంగుల కాంతికి పావురాలు రాకుండా ఉంటాయి. అల్యూమినియం ఫాయిలే లేదా ఏదైనా మెరిసే వస్తువును వేలాడదీసినా ఫలితం ఉంటుంది.

పాత బ్యాగ్‌లు లేదా దుస్తులకు ఉండే జిప్‌లను తీసి బాల్కనీ, కిటికీల అరుగులపై అంటిస్తే వాటి గరుకుదనానికి పావురాలు వాలవు.

ఇప్పటికే గూడు పెట్టివుంటే దాన్ని జాగ్రత్తగా మరో ప్రాంతానికి తరలిస్తే పావురాలు వెళ్లిపోతాయి.


ఇవి కూడా చదవండి:

Anti Corruption: అవినీతిని అరికట్టేందుకు కీలక చర్యలు.. 52 మంది అధికారుల సస్పెండ్

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 20 , 2025 | 04:38 AM