Share News

Natural Detox Tips: విషాలు ఇలా దూరం

ABN , Publish Date - Dec 30 , 2025 | 06:11 AM

పర్యావరణంలోని కలుషితాలు, ఆహారంలోని కృత్రిమ పోషకాల రూపంలో ఎన్నో విషాలు శరీరంలోకి చేరుకుంటూ ఉంటాయి. వీటిని మన కాలేయం శక్తి మేరకు విరిచేస్తూ ఉన్నప్పటికీ..

Natural Detox Tips: విషాలు ఇలా దూరం

ఆరోగ్యం

పర్యావరణంలోని కలుషితాలు, ఆహారంలోని కృత్రిమ పోషకాల రూపంలో ఎన్నో విషాలు శరీరంలోకి చేరుకుంటూ ఉంటాయి. వీటిని మన కాలేయం శక్తి మేరకు విరిచేస్తూ ఉన్నప్పటికీ, అందుకు మన వంతు తోడ్పాటు అందిస్తూ ఉండడం అవసరం. అకారణమైన అలసట, తిరగబెట్టే అలర్జీలు, దురదలు, కడుపుబ్బరం మొదలైన సమస్యలు శరీరంలో విషాలు పెరిగిపోయాయి అనడానికి సంకేతాలు. ఇలాంటప్పుడు ఆ విషాలను హరించే చర్యలు చేపట్టాలి. అవేంటంటే...

నీరు: రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి

ఆహారం: వేపుళ్లు, అధిక కొవ్వులు, పాలిష్‌ పట్టిన పదార్థాలను తగ్గించాలి

చక్కెర: చక్కెరకు బదులుగా తీపి కోసం ఖర్జూరాలను ఎంచుకోవాలి

పండ్లు: ప్రతి రోజూ కూరగాయలు, పండ్లు తినాలి

ధాన్యాలు: పాలిష్‌ పట్టిన ధాన్యాలకు బదులుగా బ్రౌన్‌ రైస్‌, ఓట్లు వాడుకోవాలి

మాంసకృత్తులు: మాంసం, చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు, అవకాడొ తరచుగా తింటూ ఉండాలి

ఉప్పు: సాధారణ ఉప్పుకు బదులుగా రాతి ఉప్పు వాడుకోవాలి

కాలేయం: కాలేయం భేషుగ్గా పని చేయడం కోసం వెల్లుల్లి, బీట్‌రూట్‌, బ్రొకొలి తినాలి

గ్రీన్‌ టీ: దీన్లోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని విషాలను హరిస్తాయి

నిద్ర: ఏడు గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి

ధ్యానం: ధ్యానంతో ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవాలి.

ఇవి కూడా చదవండి

వివాహ వేడుకలోకి అతిథుల్లా వచ్చారు.. అంతా చూస్తుండగానే..

బురదలో ఆహారం కోసం వెతుకుతున్న చిరుత.. చివరకు ముందున్న దృశ్యం చూసి..

Updated Date - Dec 30 , 2025 | 06:11 AM