How To Make Face Look Slimmer: ముఖం కోలగా.. కోమలంగా...
ABN , Publish Date - Jul 19 , 2025 | 06:12 AM
గుండ్రటి ముఖాన్ని కోలగా కనిపించేలా చేయడం కోసం కొన్ని మేకప్ మెలకువలు పాటించాలి.
గుండ్రటి ముఖాన్ని కోలగా కనిపించేలా చేయడం కోసం కొన్ని మేకప్ మెలకువలు పాటించాలి. వ్యూహాత్మకమైన కాంటూరింగ్, కళ్లను తీర్చిదిద్దుకునే విధానాలకు స్వల్ప మార్పులు చేసుకుంటే గుండ్రని ముఖం కోలగా కనిపిస్తుంది. ఆ మెలకువల గురించి లోతుగా తెలుసుకుందాం!
కాంటూర్ ఇలా: చర్మపు రంగుకు రెండింతలు ముదురు రంగులో ఉండే కాంటూరింగ్ షేడ్ ఎంచుకోవాలి. చెవుల దగ్గరి నుంచి మొదలుపెట్టి, చెక్కిళ్ల మధ్యలోకి బ్లెండ్ చేయాలి. ఈ టెక్నిక్‌తో చెక్కిళ్ల ఎముకలు స్పష్టంగా కనిపించడంతో పాటు ముఖం కోలగా మారిపోతుంది
అలాగే నుదుటి దగ్గరి వెంట్రుకలతో పాటు, దవడ దగ్గర కూడా కాంటూర్ చేసుకుంటే ముఖ పరిమితులు స్పష్టంగా కనిపిస్తాయి.
హైలైటింగ్: ముఖంలో ఎత్తుగా కనిపించే ప్రదేశాల్లో హైలైటర్ అప్లై చేయాలి. చెక్కిళ్ల ఎముకలు, ముక్కు దూలం, కనుబొమల ఎముకలు, చుబుకం దగ్గర హైలైటర్ అద్దుకోవాలి. ఆయా ప్రదేశాల్లో వెలుగు ప్రతిఫలించి, ఉబ్బెత్తుగా కనిపిస్తాయి
లైట్ హ్యాండ్ హైలైటర్‌ను ఎంచుకుంటే ఆయా ప్రదేశాలు అసహజమైన మెరుపును సంతరించుకోవు.
కనుబొమలు: కనుబొమలు పైకి లేచినట్టుగా తీర్చిదిద్దుకుంటే ముఖం కోలగా కనిపిస్తుంది
అందుకోసం బ్రో పెన్సిల్ లేదా పౌడర్‌తో కనుబొమలను తీర్చిదిద్దుకోవాలి. అలాగే కనుబొమల ఎముకలను హైలైట్ చేసుకోవాలి
కళ్లు: ఐలైనర్‌తో కళ్ల చివర్లను వంపు తిప్పుకోవాలి. దీంతో ముఖం కోలగా మారిపోతుంది
కళ్లు పెద్దవిగా కనిపించడం కోసం పైకనురెప్పలకు తప్పనిసరిగా మస్కారా అద్దుకోవాలి
ముదురు రంగు ఐ షాడోను కనురెప్పల పైన అద్దుకుని, చివర్లలో తేలిక రంగు షాడోను అద్దుకోవాలి.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి