Share News

Makeup Tips: ఎండకు చర్మం కమిలితే...

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:44 AM

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వేసవిలో చర్మం నల్లబారడం సహజం. అయితే ఈ రకమైన సన్‌ట్యాన్‌ను కప్పిపుచ్చడం కోసం మేక్‌పలో కొన్ని మెలకువలను అనుసరించక తప్పదు. అవేంటంటే....

Makeup Tips: ఎండకు చర్మం కమిలితే...

కలర్‌ కరెక్టర్‌

ఎండకు కమిలిపోయిన, రంగు మారిన చర్మం సహజసిద్ధ మెరుపును సంతరించుకోవడం కోసం కలర్‌ కరెక్టర్‌ను ఉపయోగించాలి. సన్‌ ట్యాన్‌కు గురైన ప్రదేశంలో పసుపు టోన్‌ కలిగిన కలర్‌ కరెక్టర్‌ను చర్మంలో కలిసిపోయేలా అద్దుకోవాలి. నుదురు, ముక్కు, చెక్కిళ్లు సన్‌ట్యాన్‌కు ఎక్కువగా గురవుతూ ఉంటాయి. ఆయా ప్రదేశాల్లో కలర్‌ కరెక్టర్‌ను అద్దుకుని, ఆ తర్వాతే మేకప్‌ మొదలు

పెట్టాలి.

కన్‌సీలర్‌

రంగు మారిన చర్మం మీద సన్నని గీతలు కూడా ఏర్పడతాయి. కాబట్టి వాటిని దాచడం కోసం చర్మపు రంగు కంటే తేలిక రంగులో ఉండే కన్‌సీలర్‌ను ఎంచుకోవాలి. ఈ కన్‌సీలర్‌ను తడిపి పిండిన బ్యూటీ బ్లెండర్‌ సహాయంతో చర్మం మీద అద్దుకోవాలి.

ఫౌండేషన్‌

ఎండకు కమిలిన చర్మం మరింత సున్నితంగా మారుతుంది. కాబట్టి చురుకైన రసాయనాలుండే ఫౌండేషన్లకు దూరంగా ఉండాలి. అలాగే చర్మాన్ని తేమగా ఉంచే ఫౌండేషన్లను మాత్రమే వాడుకోవాలి. అందుకోసం మాయిశ్చరైజర్‌, ఎస్‌పిఎఫ్‌ కలిగిన ఫౌండేషన్‌నే ఎంచుకోవాలి. మరీ ముఖ్యంగా వేసవిలో ముదురు రంగు ఫౌండేషన్లనే వాడుకోవాలి.


బ్రాంజర్‌

ఎండకు కమిలిన చర్మం మీద ముదురు రంగు బ్రాంజ్‌ ఎబ్బెట్టుగా ఉంటుంది. కాబట్టి లేత రంగులో ఉండే బ్రాంజ్‌ను ముక్కు, నుదురు, చెక్కిళ్ల మీద పూసుకోవచ్చు.

ఐషాడో

కనురెప్పలు ఆకర్షణీయంగా కనిపించడం కోసం బంగారువర్ణం లేదా గోధుమరంగు ఐషాడోలను ఎంచుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ రంగుల షాడోలను ఉపయోగించేటప్పుడు, ముందుగానే రెండిటినీ బాగా కలుపుకుని, తర్వాత ఉపయోగించుకోవాలి. ప్రత్యామ్నాయంగా బ్రౌన్‌ కోల్‌ లేదా లైనర్‌ కూడా వాడుకోవచ్చు. బంగారువర్ణం ద్రవరూప ఐలైనర్‌ లేదా బంగారవర్ణం ఐషాడోలు కూడా వాడుకోవచ్చు.


ఇవి కూడా చదవండి...

PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు

CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ

Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2025 | 05:44 AM