Share News

Skin Care: ల్యూబ్‌ మిలమిలలు శాశ్వతమా?

ABN , Publish Date - Jan 25 , 2025 | 03:21 AM

ముఖాన్ని మిలమిలా మెరిపించడం కోసం తాజాగా ల్యూబ్‌ ట్రెండ్‌ వాడుకలోకొచ్చింది. ప్రధానంగా సామాజిక మాధ్యమాల ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇష్టారాజ్యంగా వాడుకుంటున్న లూబ్రికెంట్ల ధోరణితో ఒరిగే లాభనష్టాలు, ప్రత్యామ్నాయాల గురించి తెలుసుకుందాం!

Skin Care: ల్యూబ్‌ మిలమిలలు శాశ్వతమా?

ముఖం ఎంతగా మెరుపులు వెదజల్లితే అంత ఎక్కువ మంది ఫాలోవర్లను సొంతం చేసుకోవచ్చనే ఆలోచనతో అందుబాటులో ఉన్న ఉపాయాలన్నీ అనుసరిస్తూ ఉంటారు ఇన్‌ఫ్లూయెన్సర్లు. సన్నిహిత ప్రదేశాల కోసం ఉద్దేశించిన ల్యూబ్స్‌ను ముఖం మెరుపుకు ఉపయోగించే ధోరణి ఊపందుకుంటోంది. జారుడుగా ఉండి, తాత్కాలికంగా ముఖానికి బిగుతును, మెరుపునూ పెంచే ల్యూబ్‌లు, మేక్‌పలో కీలకమైన ప్రైమర్ల స్థానాన్ని భర్తీ చేయడం మొదలుపెట్టాయి. ముఖాన్ని నునుపుగా మార్చి, చర్మ రంథ్రాలను కనిపించకుండా చేసి, మేక్‌పకు ముఖాన్ని సిద్ధం చేసే సాధనాలు ప్రైమర్లు. అంతకు మించిన ఫలితాన్ని అందిస్తున్నాయనే కొన్ని ల్యూబ్‌ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో ఈ పాశ్చాత్య సంస్కృతి మన దేశంలో కూడా విస్తరించింది. అయితే ల్యూబ్‌లను ప్రైమర్లుగా వాడడం వల్ల కొన్ని దుష్ప్రభావాలుంటాయి. అవేంటంటే....

సిలికాన్‌ లేదా నీటి ఆధారిత ల్యూబ్‌లు కొన్ని వాణిజ్య ప్రైమర్లను మరిపించినప్పటికీ అవి ముఖ సౌందర్యానికి తగ్గట్టు తయారైనవి కావు

సిలికాన్‌ ఆధారిత ల్యూబ్‌లు దీర్ఘకాల వినియోగానికి ఉద్దేశించి తయారైనవి కావు

సన్నిహిత సందర్భాల కోసం తయారైన లూబ్రికెంట్స్‌లో ముఖ చర్మానికి హాని చేసే కారకాలుంటాయి

బిగుతును పెంచే ల్యూబ్స్‌ వల్ల, కళ్ల దిగువన, పెదవులు చుట్టూరా సన్నని గీతలు ఏర్పడతాయి

ల్యూబ్స్‌తో చర్మం రంథ్రాలు పూడుకుపోయే ప్రమాదం ఉంది

ల్యూబ్‌ వాడకంతో ముఖానికి అంటుకున్న జిడ్డును తొలగించడం కష్టమవుతుంది.


ప్రత్యామ్నాయాలు ఇవే

ముఖానికి మెరుపు కోసం చవకగా దొరికే ల్యూబ్స్‌ ఉపయోగించి, చర్మ సమస్యలను కొని తెచ్చుకునే బదులు, చర్మ తత్వానికి నప్పే ప్రైమర్లను ఎంచుకోవడం అన్ని విధాలా సురక్షితం. వాటిని ఎలా ఎంచుకోవాలంటే...

పొడి చర్మం కలిగినవాళ్లు హైడ్రేటింగ్‌ ప్రైమర్లను ఎంచుకోవాలి

చర్మ రంథ్రాలు పెద్దవిగా ఉన్నవాళ్లు వాటిని కప్పేసే, పోర్‌ ఫిల్లింగ్‌ ప్రైమర్లను ఎంచుకోవాలి

జిడ్డు చర్మం కలిగినవాళ్లు, మాటిఫైయింగ్‌ ప్రైమర్లు ? వాడుకోవాలి.


ఇవి కూడా చదవండి..

Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా

Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..

Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 25 , 2025 | 03:56 AM